Swetha Naagu: మనలో చాలా మందికి పాములంటే భయం. కొందరికి భక్తి ఉంటుంది. వాటిని చూస్తే పారిపోవడం ఖాయం. పాములంటే అంత భయం కలగడం సహజం. పూర్వ కాలం నుంచి వాటిని మనం దేవతలుగా కొలుస్తున్నాం. అందుకే నాగదేవత విగ్రహాలు వెలిశాయి. ఎదురుగా కనబడితే చాలా మంది మొక్కుతారు. దేవుడా నన్ను ఏం చేయొద్దు. నీ దారిన నువ్వు పో దేవుడా అంటూ వేడుకుంటారు. ఇలా పాములకు మనం ఇచ్చే ప్రాధాన్యం అలాంటిది.
నాగుల చవితి, నాగ పంచమికి పుట్టలో పాలు పోసి మొక్కుతుంటారు. మహిళలైతే ఈ పండుగలను వైభవంగా జరుపుకుంటారు. తమ కుటుంబాన్నికాపాడాలని పుట్టలో పాలుపోసి వేడకుంటారు. నాగదేవతకు నైవేద్యాలు పెడతారు. పాలు, గుడ్లు పెట్టి కాపాడు దేవుడా అంటూ ప్రార్థిస్తారు. ఇలా పాములకు మనకు అవినాభావ సంబంధం ఏర్పడింది.
తమిళనాడులోని కోయంబత్తూరులో కురుచ్చి శక్తినగర్ లో ఓ శ్వేత నాగు స్థానికులకు కనిపించింది. దీంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. పాము తెల్లగా ఉండటం ఇదే మొదటి సారి చూడటం అని అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. జన్యులోపంతోనే ఇలా తెల్లగా ఉంటాయని చెప్పారు.