https://oktelugu.com/

Rental House : అద్దె ఇల్లు కోసం వెతుకుతున్నారా? అయితే వీటి గురించి కచ్చితంగా తెలుసుకోండి..

అద్దె ఇల్లు ఎప్పటికీ సొంతిల్లు కాకపోయినా.. ఇందులోనే ఉంటారు. ఇక్కడే నిద్రిస్తారు. ఇక్కడే వంట చేసి, భోజనం చేస్తారు. అందువల్ల ఇలాంటి ఇళ్లల్లో ఉన్నంత సేపు సొంతిల్లులాగే భావించాలి. కొందరు ఇల్లు నిర్మించేటప్పుడు తమ సొంత అవసరాలకు వాస్తు ప్రకారంగా కొన్ని గదులు నిర్మిస్తారు.మరికొన్ని మాత్రం ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 4, 2024 / 09:40 PM IST

    Rental House

    Follow us on

    Rental House :  ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఉన్న ఊరు నుంచి పట్టణాలకు, నగరాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ సమయంలో ఇక్కడ అద్దె ఇల్లు కోసం వెతుకుతూ ఉంటారు. ఉద్యోగం చేసేవారు తమ కార్యాలయానికి దగ్గరగా ఉండాని చూస్తారు. అయితే ఈ సమయంలో ఏదో ఒక ఇంట్లోకి అద్దెకు దిగడం వల్ల అనుకున్న జీవితం ఉండదు. అద్దె ఇల్లు సొంత ఇల్లుతో సమానం కాకపోయినాయ.. ఇది కూడా వాస్తు ప్రకారంగా ఉండడం వల్లే జీవితం సంతోషంగా ఉండదు. అందువల్ల అద్దె ఇల్లు కూడా వాస్తు ప్రకారంగా ఉండాలి. ఇందులో భాగంగా కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. అవేంటంటే?

    అద్దె ఇల్లు ఎప్పటికీ సొంతిల్లు కాకపోయినా.. ఇందులోనే ఉంటారు. ఇక్కడే నిద్రిస్తారు. ఇక్కడే వంట చేసి, భోజనం చేస్తారు. అందువల్ల ఇలాంటి ఇళ్లల్లో ఉన్నంత సేపు సొంతిల్లులాగే భావించాలి. కొందరు ఇల్లు నిర్మించేటప్పుడు తమ సొంత అవసరాలకు వాస్తు ప్రకారంగా కొన్ని గదులు నిర్మిస్తారు.మరికొన్ని మాత్రం ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ గదుల్లో ఎవరైతే నివసిస్తారో వారికి నష్టం కలుగుతుంది. అందువల్ల అద్దె ఇంట్లోకి వెళ్లే సమయంలో వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

    ముందుగా అద్దె ఇల్లు మెయిన్ డోర్ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉందా లేదా చూసుకోవాలి. కొన్ని ఇళ్లు పడమర వైపు నుంచి ఎంట్రెన్స్ ఉన్నా.. తూర్పు వైపు మరో డోర్ ఉండడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. ఇందులో వెంటిలేషన్ ప్రధానమైనది. ఇంట్లోకి సరైన వెలుతురు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యాంగా ఇంట్లోకి గాలి చోరబడకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వెంటిలేషన్ సరైన విధంగా వచ్చే ఇంట్లోకి దిగడం మంచిది.

    బెడ్ రూం నైరుతి వైపు ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. కొన్ని ఇళ్లల్లో బెడ్ రూం ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేస్తారు. ఇలా కాకుండా నైరుతి, పడమర కలిసి ఉండేలా ఉండడం వల్ల ఇందులోకి గాలి ఎక్కువగా వస్తుంది. దీంతో నిత్యం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇంటికి సమీపంలో శ్మశానం లేకుండా చూసుకోవాలి. ఇక ఈశాన్యం వైపు పొడవు ఎక్కువగా ఇంట్లోకి వెళ్లడం మంచిది. అలాగే ఈశాన్యంలో బరువులు ఎక్కువగా లేకుండా చూడాలి.

    సిటీ మధ్యలో అద్దెకు ఉండడం వల్ల ధరలు అధికంగా ఉంటాయి. అయితే ఆదాయం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు కాస్త దూరమైనా ప్రశాంత వాతావరణంలో ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే కార్యాలయాల్లో సరిగ్గా పనిచేయగలుగుతారు. కార్యాలయాల్లో మనసు ప్రశాంతంగా లేకపోవడం వల్ల ఇంట్లో హాయిగా ఉండే ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక అద్దె ఇల్లు అని చిన్న చూపు చూడకూడదు. నిత్యం పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటూ అలంకరణం చేసుకోవాలి. దీంతో ఉల్లాసంగా జీవిస్తారు. కాస్త ప్లేస్ ఉంటే ఓనర్ల సహాయంతో చెట్లను పెంచుకోవాలి. చివరి విషయం ఏంటంటే అద్దె ఇంట్లోకి దిగే ముందు చుట్టుపక్కల వారి వ్యక్తిత్వాల గురించి తెలుసుకోవాలి. చుట్టుపక్కల వారు మంచి వారు అయితేనే ప్రశాంతమైన జీవితం ఉంటుంది.