https://oktelugu.com/

Arundhati : ‘అరుంధతి’ చిత్రంలో నటించిన ‘జలజమ్మ’ గుర్తుందా..? ఈమె కూతురు ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద హీరోయిన్..ఎవరో గుర్తుపట్టగలరా?

అరుంధతి చిత్రంలోని ప్రతీ పాత్రని మనం అంత తేలికగా మరచిపోలేము. ముఖ్యంగా పశుపతి , అదే విధంగా పశుపతికి తల్లి పాత్ర పోషించిన 'జలజమ్మ' క్యారక్టర్స్ ని తల్చుకుంటే ఆడియన్స్ ఇప్పటికీ భయపడిపోతారు. సినిమా ప్రారంభంలోనే కోటలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులను జలజమ్మ 'రండి రా..రండి' అని పిలుస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 4, 2024 / 09:47 PM IST

    Arundhati

    Follow us on

    Arundhati : ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధతి’ చిత్రం అప్పట్లో ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా థియేటర్స్ లో ఆడియన్స్ ని ఒక రేంజ్ లో భయపెట్టింది. ఇప్పటికిప్పుడు ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్స్ లో విడుదల చేస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆరోజుల్లోనే ఆ గ్రాఫిక్స్ ని, టెక్నాలజీని చూస్తే కోడి రామకృష్ణ ఎంతటి ప్రతిభ ఉన్నవాడో అందరికీ అర్థం అవుతుంది. అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ చిత్రానికి 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది. ఇది అప్పట్లో ఇండస్ట్రీ హిట్. ఇప్పట్లో పోకిరి ని కొట్టడం ఎవరికీ సాధ్యం కాదని అప్పట్లో ట్రేడ్ పండితులు కూడా అనుకున్నారు. కానీ అరుంధతి చిత్రానికి 30 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే దాదాపుగా ఇండస్ట్రీ హిట్ రేంజ్ అన్నమాట.

    ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలోని ప్రతీ పాత్రని మనం అంత తేలికగా మరచిపోలేము. ముఖ్యంగా పశుపతి , అదే విధంగా పశుపతికి తల్లి పాత్ర పోషించిన ‘జలజమ్మ’ క్యారక్టర్స్ ని తల్చుకుంటే ఆడియన్స్ ఇప్పటికీ భయపడిపోతారు. సినిమా ప్రారంభంలోనే కోటలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులను జలజమ్మ ‘రండి రా..రండి’ అని పిలుస్తుంది. ఆ సన్నివేశంలో అతి భయంకరంగా ఎక్స్ ప్రెషన్స్ పెడుతూ ఆడియన్స్ కి వెన్నులో వణుకు పుట్టేలా చేసిన ఈ నటి పేరు సుభాషిణి. ఈమె సోదరి మరెవరో కాదు, ఎన్నో వందల సినిమాల్లో హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్టు గా ఇండస్ట్రీ లో సహజ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జయసుధకి సోదరి. ఈమె దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘శివరంజని’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆమె సోదరి జయసుధ ఇందులో హీరోయిన్. అప్పట్లో ఈ చిత్రం భారీ హిట్ అవ్వడంతో సుభాషిణి కి మంచి గుర్తింపు లభించింది.

    ఇక ఆ తర్వాత జయసుధ సోదరి అని ఆడియన్స్ కి తెలిసిన తర్వాత ఈమెకి ఇంకా మంచి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపుతో తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం భాషల్లో పలు సినిమాలు చేసిన సుభాషిణి, టీవీ సీరియల్స్ లో కూడా కనిపించింది. 2009 వ సంవత్సరం లో విడుదలైన ‘అరుంధతి’ తర్వాత ఈమె సినిమాలు చేయడం ఆపేసింది. ఇది ఇలా ఉండగా ఈమెకు పూజ అనే కూతురు ఉంది. ఈమె కూడా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఆ తర్వాత ఇంట్లో పెద్దలు చూసిన పెళ్లి చేసుకొని, విదేశాల్లో స్థిరపడింది. ఈమె లేటెస్ట్ ఫోటోలను చూస్తే ఇంత అందమైన అమ్మాయి సరైన అవకాశాల కోసం ఎదురు చూడాల్సింది, ఇండస్ట్రీ లో పెద్ద స్థాయికి వెళ్ళేది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.