https://oktelugu.com/

Pawan Kalyan : సొంత కూటమి హోంమంత్రిపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక అంతరార్థమేంటి? తెరవెనుక ఏం జరిగింది?

డిప్యూటీ సీఎంగా ఉంటూ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పవన్ బహిరంగంగా హోం మంత్రికి.. పోలీసులకు సూచనలు చేస్తూనే వార్నింగ్ ఇచ్చారు.

Written By:
  • Rocky
  • , Updated On : November 4, 2024 / 09:37 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan : ఏపీలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రిగా అనిత విఫలమయ్యారని ఆమె రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అసలు పవన్ నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం టీడీపీ నేతలకు అంతుపట్టడం లేదు. కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నోటి వెంట అలాంటి మాటలు వచ్చాయంటే.. అవి ఊరికే అనాలోచితంగా రావు. నేనే హోం మంత్రిని అయితే అంటూ అంతర్గతంగా చెప్పాల్సిన అంశాలు ఇలా ఓపెన్ గా చెప్పడం వెనుక పవన్ కళ్యాణ్ భారీ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది.

    పవన్ అన్న మాటలు వింటుంటే వినడానికి లేదా చూడ్డానికి ఏదో ఫ్లో లో మాట్లాడిన మాటలు కావని అర్థం అవుతుంది. కానీ దాని వెనుక పక్కా ప్లానింగ్ ఉంటుందని అనిపిస్తుంది. ప్లానింగ్ అంటే పవన్ కళ్యాణ్ ది మాత్రమే కాదు. ఇటు తెలుగు దేశం పార్టీది కూడా ఉంటుంది. వాస్తవానికి రాష్ట్రంలో పెద్ద చర్యలు ఏం తీసుకోవాలన్న ప్రభుత్వం భాగస్వాములుగా ఉన్న ముగ్గరు కూటమి పెద్దలు ఓ మాట మీదే ఉండి నిర్ణయాలు తీసుకుంటారు. అలా ముగ్గురు అనుకున్న తరువాతే పవన్ కళ్యాణ్ నోటి నుంచైనా మరే నాయకుడి నోటి వెంట అయినా ఆ మాట వస్తుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా దాదాపు అయిదారేళ్లుగా గమనిస్తే ఇదే టైమింగ్.. ఇదే లెంగ్త్ కనిపిస్తుంది.

    ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటి వెంట ఓ మాట వచ్చింది. అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై హోం మంత్రి అనిత కు చిన్న హెచ్చరికలాంటిది చేశారు. గతంలా కాకుండా భవిష్యతులో మరింత చురుగ్గా వ్యవహరించాలని, లేదంటే తను సీన్లోకి ఎంటర్ అయితే, అంటే తను కనుక హోం మంత్రి అయితే పరిస్థితి వేరుగా ఉంటుందని అన్నారు. అనిత హోం మంత్రి అయిన తరువాత ఇలాంటి సుతి మెత్తని హెచ్చరిక రావడం ఇదే మొదటి సారి మాత్రం కాదు. మొదట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఓసారి సుతిమెత్తగా ఆమెను హెచ్చరించారు. కానీ ఇటీవల రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు బాగా పెరిగిపోయాయి. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిపై హోం మంత్రి తీసుకున్న నిర్ణయాలపై జనాల్లో ఎలాంటి రియాక్షన్ వచ్చిందో చూసే ఉన్నాం. జ‌నం కూడా వీటి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది కాస్తా నేరుగా కూటమి దృష్టికి వెళ్లే ఉంటుంది.

    నిజానికి హోం మంత్రిగా చేయగలిగింది, నిష్పక్షపాతంగా ఉండమని అధికారులకు చెప్పడం వరకే. అంతే తప్ప గ్రౌండ్ లో దిగి దర్యాప్తు చేయరు. అరెస్ట్ లు చేయరు. అవన్నీ సాగించాల్సింది అధికారులు. వారు ఉదాసీనంగా వ్యవహిస్తుంటే నేరాలు పెరుగుతాయి. వారు అలా ఉండకుండా చూడాల్సింది ఆ శాఖ పెద్దగా వ్యవహరిస్తున్న హోం మంత్రి. కానీ హోం మంత్రిగా పోస్టింగ్ లు, బదిలీలపై ఆమెకు ఎంత వరకు సాధించాలి. లేకపోతే హోం మంత్రిగా బలమైన, అనుభవం కలిగిన వారు ఉండాలి. లేదంటే… రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువవుతుంది. అది ప్రభుత్వానికే మాయని మచ్చగా మిగిలిపోతుంది. అందుకే గట్టిగా ఉండాలని పవన్ ఆమెను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఒక వేళ తను మారకపోతే ఆమె శాఖను భర్తీ చేస్తారన్న పరోక్ష సూచనలు ఇచ్చినట్లు అనుకోవచ్చు.