Studying
Studying : చదువుకోవడం చాలా అవసరం. ఇక చదువు ప్రతి ఒక్కరికి చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది. ఉద్యోగాల కోసం మాత్రమే కాదు జీవితంలో చాలా చోట్ల కూడా చదువు ఉపయోగపడుతుంది. అందుకే చదువును నెగ్లెట్ చేయవద్దు. ఎప్పుడు చదువుకోవాల్సిందే. ఇక చాలా మంది చదువును వాయిదా వేస్తుంటారు. ఇది ఒక సాధారణ సమస్య. అయితే చదువును మాత్రం అసలు నెగ్లెట్ చేయవద్దు. లేదంటే జీవితంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు చదవాలి అనుకున్నా సరే చాలా విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? అయితే మీరు చదువుకొనేటప్పుడు కొన్ని విషయాలను పక్కన పెట్టండి. అప్పుడు మీ చదువు బెటర్ అవుతుంది. ఎలా అంటారా?
చదువుతున్నప్పుడు మీ ఫోన్‌ను అందుబాటులో ఉంచుకోవద్దు. సోషల్ మీడియాను తనిఖీ చేయడం పూర్తిగా మానుకోండి. పరధ్యానాన్ని పెంచుతుంది. ఇక మీ చదువుకునే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. చదివే సమయంలో చాలా మంది రీఫ్రెష్ కోసం ఒక పదినిమిషాలు ఫోన్న చూద్దాం లే అనుకుంటారు. కానీ ఇదే మీకు చాలా పెద్ద సమస్యను తెచ్చి పెడుతుంది. స్టడీ సెషన్‌ల సమయంలో విరామాలను దాటవేయవద్దు కూడా. దీని వల్ల మీ ఫోకస్ దెబ్బతింటుంది. రెగ్యులర్ బ్రేక్‌లు కచ్చితంగా అవసరం.
మంచం వంటి అనుచితమైన వాతావరణంలో చదువుకోవడం వల్ల ఏకాగ్రత కష్టమవుతుంది. మంచి ప్లేస్ లో చదువుకోవాలి. మీ మనసు కూల్ గా ఉండే ప్లేస్ లో చదువుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం చాలా అవసరం. మంచి వాతావరణం మీ మనసు, మైండ్ ను ప్రభావితం చేస్తుంది. అధ్యయన సెషన్‌లలో అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శక్తి, దృష్టిని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు అంటున్నారు నిపుణులు. ఉపాధ్యాయులు లేదా తోటివారితో సందేహాలను నివృత్తి చేసుకోవాలి. కానీ కొందరు మాత్రం అవసరమైనప్పుడు సహాయం కోరరు. ఇబ్బంది పడతారు. దీంతో మీకు మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అసైన్‌మెంట్‌లు లేదా పరీక్ష తయారీని చివరి నిమిషం వరకు వదిలివేయడం వంటివి అనవసరమైన ఒత్తిడిని, పేలవమైన ఫలితాలను సృష్టిస్తుంది. అందుకే ముందే మీరు ప్లానింగ్ చేసుకోవాలి. పరీక్ష సమయం వరకు మీ పనులను వాయిదా వేసుకోవద్దు. వెంటనే అన్ని చేసుకోవాలి. తగినంత నిద్ర పోవాలి. నిద్రను నిర్లక్ష్యం చేయడం వల్ల మానసిక, శారీరక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. నేర్చుకోవడం కష్టతరం చేస్తుంది. చాలా మంది ఆహారం విషయంలో, నిద్ర విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోరు. సరైనా నిద్ర, సరైనా ఆహారం అవసరం అని గుర్తు పెట్టుకోండి.
మీకు పక్కన ఎవరి మాటలు అయినా వినిపిస్తూ ఉంటే వాటికి కాస్త దూరంగా కూర్చోవాలి. లేదంటే మీ మనసు వారి మీదకు మళ్లుతుంది. ఆ మాటలు, విషయాలు మీ చదువును డిస్ట్రబ్ చేస్తాయి. మీరు ఎంచుకునే వాతావరణం, సమయం, జాగ్రత్తలు చాలా అవసరం అంటున్నారు నిపుణులు.