Homeఅంతర్జాతీయంElon Musk : సుచిర్‌ బాలాజీది ఆత్మహత్య కాదా.. సంచలన వ్యాఖ్యలు చేసి మస్క్‌.. కారణం...

Elon Musk : సుచిర్‌ బాలాజీది ఆత్మహత్య కాదా.. సంచలన వ్యాఖ్యలు చేసి మస్క్‌.. కారణం ఏంటి?

Elon Musk : చాట్‌ జీపీటీ మాతృ సంస్థ అయిన ఓపెన్‌ ఏఐ సమాజానికి హానికరమని విమర్శలు చేశాడు ప్రజావేగు(విజిల్‌ బ్లోయర్‌) సుచిర్‌ బాలాజీ. ప్రపంచ వ్యాప్తంగా ఓపెన్‌ ఏఐపై తీవ్రస్థాయిలో చర్చ జరిగేలా చేశారు. ఆయన హఠాత్తుగా మరణించడం ఇప్పుడు టెక్‌ వరల్డ్‌ను షాక్‌కు గురిచేసింది. బాలాజీ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్, స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. సుచిర్‌ది ఆత్మహత్యలా అనిపించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే..
సుచిర్‌ బాలాజీ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోలో తన అపార్టమెంట్‌లో నవంబర్‌ 2న విగత జీవిగా కనిపించారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు దానిని ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని బాలాజీ తల్లి పూర్ణిమారావు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. తాము ప్రైవేటు ఇన్వెస్టిగేటర్‌ను నియమించుకుని రెండోసారి శవ పరీక్ష చేశామని తెలిపారు. ఆ పరీక్ష ఫలితాలు పోలీసులకు చెప్పిన ఫలితాలకు భిన్నంగా ఉన్నాయని వెల్లడించారు. సుచిర్‌ అపార్ట్‌మెంట్‌ను ఎవరో దోచుకున్నట్లు కనిపిస్తోందని, బాత్‌రూంలో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని, రక్తపు మరకలు కనిపించాయని తెలిపింది. ఎవరో అతడిని కొట్టి ఉంటారని అనుమానించారు. హత్యను పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌బీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ పోస్టును ఎలాన్‌ మస్క్, భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామికి, భారత విదేశాంగ శాఖకు ట్యాగ్‌ చేశారు.

స్పందించిన మస్క్‌…
పూర్ణిమారావు పోస్టుపై ప్రపంచ కుభేరుడు మస్క్‌ స్పందించారు. సుచిర్‌ది ఆత్మహత్యలా అనిపించడం లేదు అని పోస్ట్‌ చేశారు. భారత సంతతికి చెందిన సుచిర్‌ బాలాజీ నాలేగుళ్లపటు ఓపెన్‌ ఏఐలో పరిశోధకుడిగా పనిచేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా సమాజానికి ప్రయోజనం కన్నా హానే ఎక్కువ అని, సాంకేతికతల అభివృద్ధి కోసం సంస్థ కాపీరైట్‌ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. అక్టోబర్‌లో న్యూయార్క్‌ టైమ్స్‌తో బాలాజీ మాట్లాడుతూ ‘వ్యక్తుల, వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్‌ జీపీటీ, ఇతర చాట్‌బాట్‌లు ధ్వసం చేస్తున్నాయి’ అని రోపించారు. 2022లో కాపీరైట్‌ ఉల్లంఘనలకు సంబంధించి అనేక వ్యాజ్యాలు ఓపెన్‌ ఏఐపై దాఖలాయ్యాయి. ఈ కేసులో బాలాజీ సాక్ష్యం కీలకం కానుంది. ఈ నేపథ్యంలో అతను మరణించడం అనుమానాలకు తావిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version