Guest: హిందూ మతంలో ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలా విషయాల్లో కూడా నియమాలు పాటిస్తారు. ఉదాహరణకు ఉదయం లేచిన వెంటనే కొన్ని వస్తువులను చూడకూడదు. కేవలం అర చేతులను మాత్రమే చూడాలని మన పెద్దలు చెబుతుంటారు. అయితే మన ఇండియాలో మతంతో సంబంధం లేకుండా కొన్ని నియమాలు పాటిస్తారు. అందులో ఒకటి అతిథిని గౌరవించడం. కొందరు అతిథులను దైవంగా కూడా భావిస్తారు. ఇంటికి వస్తే వారికి సకల మర్యాదలు చేస్తారు. వాళ్లు కాళ్లు కింద పెట్టకుండా చూసుకుంటారు. అయితే పండుగలు, ఫంక్షన్ల సమయంలో కాకుండా సాధారణ సమయంలో కొందరు అతిథులు ఇంటికి వస్తుంటారు. లేదా మనం ఇతరుల ఇంటికి వెళ్తుంటాం. ఇలాంటి సమయాల్లో వారి ఇంటికి ఏదో ఒకటి తీసుకెళ్తుంటారు. సాధారణంగా వారి ఇంట్లో పిల్లలు ఉంటే ఏవైనా స్వీట్లు, పండ్లు, చాక్లెట్లు వంటివి తీసుకెళ్తుంటారు. ఒకవేళ లేకపోయిన కూడా కొందరు తీసుకెళ్తారు. కొందరు మాత్రం ఏమి తీసుకెళ్లకుండా వెళ్తుంటారు. అయితే అతిథులుగా వెళ్లే వారు ఇలా ఖాళీ చేతులతో వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా వెళ్లడం వల్ల వారి జీవితంలో ఆర్థిక సంక్షోభం వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎదుటి వారి స్తోమతను బట్టి కాకుండా మీ స్తోమతను బట్టి ఏదో ఒకటి తీసుకెళ్లాలి. అయితే కొన్ని ప్రదేశాలకు వెళ్లినప్పుడు అసలు ఖాళీ చేతులతో వెళ్లకూడదట. మరి ఆ ప్రదేశాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్నేహితుల ఇంటికి
సాధారణంగా స్నేహితుల ఇంటికి వెళ్తుంటారు. మన స్నేహితుడే ఏం అనుకోడని కొందరు ఏం తీసుకెళ్లకుండా ఖాళీ చేతులతో వెళ్తారు. ఇలా అసలు వెళ్లకూడదని నిపుణులు అంటున్నారు. స్నేహితుడు ఇంటికి వెళ్లిన కూడా ఏదో ఒకటి తీసుకెళ్లాలని అంటున్నారు.
సోదరి ఇంటికి వెళ్లినప్పుడు
సాధారణంగా సోదరి ఇంటికి సోదరుడు వెళ్తుంటారు. ఇలా ఖాళీ చేతులతో అసలు వెళ్లకూడదు. పెళ్లయిన ఆడపిల్ల ఇంటికి వెళ్లినప్పుడు ఎవరైనా కూడా ఖాళీ చేతులతో వెళ్లకుండా ఏదో ఒకటి తీసుకుని వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. తల్లి లేదా తండ్రి కూతురు ఇంటికి వెళ్తే ఏదో ఒకటి తప్పకుండా తీసుకెళ్లాలని పండితులు చెబుతున్నారు.
ఆలయాలు
సాధారణంగా ఆలయాలకు వెళ్తే కొబ్బరి కాయ, పండ్లు వంటివి తీసుకెళ్తుంటాం. కానీ కొన్నిసార్లు కొందరు ఏం తీసుకెళ్లకుండా దక్షిణ వేసేద్దాం అని అనుకుంటారు. ఇలా తప్పని పండితులు అంటున్నారు. ఆలయాలకు వెళ్లేటప్పుడు తప్పకుండా పండ్లు, స్వీట్లు, ప్రసాదం ఇలా ఏదో ఒకటి తీసుకెళ్లాలని పండితులు చెబుతున్నారు.
గురువు ఇంటికి
మన చదువు నేర్పని గురువు ఇంటికి ఖాళీ చేతులతో వెళ్లకూడదని పండితులు అంటున్నారు. మనకి విద్య నేర్పని గురువు ఇంటికి ఏదో ఒకటి తీసుకెళ్లాలి. లేకపోతే మీరు ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.