Buying A New Car: నేటి కాలంలో కారు కొందరికి అత్యవసరంగా మారింది. కార్యాలయ అవసరాల నేపథ్యంలో సమయానికి గమ్యానికి చేరుకోవాలంటే కారు తప్పనిసరి. మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయడానికి 4 వెహికల్ ను కొనుగోలు చేస్తుంటారు. అయితే కారు కొనుగోలు చేసే సమయంలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని కంపెనీలు తమ కార్ల సేల్స్ పెంచుకునేందుకు అదనపు ఫీచర్లను జోడిస్తారు. ఇవి ఒక విధంగా ఆకర్షణీయంగా ఉండొచ్చు. కానీ అవి ఎంత వరకు అవసరం అనేది గుర్తించాలి. ఇవి తప్పనిసరి అయితే పర్వాలేదు. కానీ అనవసరం అయితే వాటికి దూరంగా ఉండాలి. లేకుంటే కారు బడ్జెట్ కంటే ఇవి ఎక్కువ కావడంతో పాటు ప్రయాణానికి ఇబ్బంది పెడుతాయి. అయితే ఎలాంటి ఫీచర్లు అనవసరమో తెలుసా?
సన్ రూఫ్:
ప్రస్తుత కాలంలో కారుకు అదనపు ఫీచర్ గా ‘సన్ రూఫ్’ ను చేర్చుతున్నారు. ఇది కారు పై భాగంలో ఉండడంతో వెంటిలేషన్ ఎక్కువగా ఉండి ప్రయాణం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు దీని విండో ఓపెన్ చేసి ప్రయాణం చేస్తారు. ఈ సమయంలో పిల్లలు వీటిలో నుంచి తల పైకి ఉంచి ఎంజాయ్ చేస్తారు.ఇది వారికి ఉల్లాసంగానే ఉంటుంది. కానీ భారత్ లో అన్ని ప్రదేశాల్లో ఇది సాధ్యం కాదు. అంతేకాకుండా ఇందులో నుంచి వాటర్ లీక్ అయినట్లు కొందరు వినియోగదారులు తెలిపారు. అంతేకాకుండా దీనికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది. కారుకు అదనంగా సన్ రూఫ్ కావాలంటే రూ. 30 నుంచి 90 వేల వరకు ఉంది. దీనిని మినహాయించడం వల్ల చాలా వరకు డబ్బు సేఫ్ అవుతుంది.
బిగ్ స్క్రీన్ డిస్ ప్లే:
కారులో ఒకప్పుడు బటన్ సిస్టమ్ ఉండేది. ప్రతీ అవసరానికి బటన్ ఫుష్ చేసేవారు. కానీ ఇప్పుడు బిగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను అమరుస్తున్నారు. అయితే ఇది డ్రైవర్లను అయోమయానికి గురి చేస్తుంది. కారు డ్రైవ్ చేసే సమయంలో బటన్ పుష్ ఈజీగా ఉంటుంది. కానీ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేతో ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా ఒక్కోసారి స్క్రీన్ పనిచేయకపోవడంతో ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడుతాయి. అయితే ఇది లేకున్నా డ్రైవింగ్ ఈజీగా ఉంటుందని అనుకునేవారు దీనిని చేర్చకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.
అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టన్స్ సిస్టమ్:
ఇది డ్రైవర్లకు చాలా వరకు శ్రమను తగ్గిస్తుంది. గేర్ మార్పు నుంచి బ్రేకింగ్ వరకు మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ గా అందించడానికి ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది. అంతేకాకుడా అత్యవసర సమయాల్లో ప్రమాదాల నుంచి కాపాడుతాయి. అయితే భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సరైన రోడ్ల సౌకర్యాలు లేవు. దీంతో ఇక్కడ ఆటోమేటిక్ సిస్టమ్ అనుకూలంగా ఉండదు. కొందరు డ్రైవర్లు లేటేస్ట్ ఫీచర్స్ కు అలవాటు పడకపోవడంతో వారు సాంప్రదాయ కార్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఇది ఆటోమేటిక్ గా పనిచేయడంతో కొన్నిసార్లు అవసరం లేకున్నా బ్రేక్ పడడం వంటివి చేయడం వల్ల ఇబ్బందిగా మారుతుంది. అందువల్ల దీనిని అనవసరం అనుకుంటే దూరంగా ఉంచండి.