https://oktelugu.com/

Keerthy Suresh: 15 ఏళ్ల రహస్య ప్రేమాయణం, కీర్తి సురేష్ కి కాబోయే భర్త ఎవరో తెలుసా? షాకింగ్ డిటైల్స్!

కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం అందుతుంది. 15 ఏళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తున్న కీర్తి సురేష్ పెళ్ళికి సిద్దమైందట. డిసెంబర్ లో ముహూర్తం కుదిరిందట. ఇంతకీ కీర్తి సురేష్ కి కాబోయే భర్త ఎవరు? ఇంట్రెస్టింగ్ డిటైల్స్..

Written By:
  • Gopi
  • , Updated On : November 19, 2024 / 12:50 PM IST

    Keerthy Suresh is ready to marry her boyfriend

    Follow us on

    Keerthy Suresh: సౌత్ ఇండియా టాప్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి కీర్తి సురేష్ వచ్చారు. తండ్రి సురేష్ దర్శకుడు. తల్లి మేనక 80-90లలో స్టార్ హీరోయిన్. వందల చిత్రాల్లో నటించింది. తెలుగులో మేనక తక్కువ చిత్రాలు చేసింది. చిరంజీవి నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర చేసిన పున్నమి నాగు చిత్రంలో మేనక హీరోయిన్ గా నటించడం విశేషం. తెలుగుతో పాటు తమిళ్ లో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది.

    కీర్తి సురేష్ కెరీర్లో మహానటి మైలురాయిగా ఉంది. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్. సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతమైన నటనతో మెప్పించింది. కీర్తి సురేష్ ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందడం విశేషం. అటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే కీర్తి సురేష్, స్టార్ హీరోల సరసన జతకడుతుంది.

    కాగా కీర్తి సురేష్ పెళ్లి అంటూ తరచుగా పుకార్లు చక్కర్లు కొడుతుంటాయి. ఆమెపై కొన్ని ఎఫైర్ రూమర్స్ కూడా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, హీరో విజయ్ తో ముడిపెడుతూ కథనాలు వెలువడ్డాయి. తాజాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లి అంటూ కోలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. కీర్తి సురేష్ కి కాబోయే భర్త ఈయనే అంటూ ఓ ఫోటో వైరల్ అవుతుంది.

    కీర్తి సురేష్ కాబోయే భర్త పేరు ఆంటోని తటిల్ అట. ఈయన దుబాయ్ లో వ్యాపారవేత్త అట. కీర్తి సురేష్-ఆంటోని దాదాపు 15 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నారట. రహస్యంగా ప్రేమాయణం సాగిస్తున్నారట. ఎట్టకేలకు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించారట. గోవా వేదికగా డిసెంబర్ 11, 12 తారీఖుల్లో పెళ్లి జరగనుందట.

    ఎప్పటిలాగే కీర్తి సురేష్ తన పెళ్లి వార్తలపై స్పందించలేదు. మరి ఈ కథనాల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. కీర్తి సురేష్ అప్ కమింగ్ చిత్రాలు పరిశీలిస్తే… బేబీ జాన్ టైటిల్ తో ఒక బాలీవుడ్ మూవీ చేస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం తేరి రీమేక్. కీర్తి సురేష్ కి ఇది ఫస్ట్ డెబ్యూ మూవీ. అలాగే కన్నెవేడి,రివాల్వర్ రీటా టైటిల్ తో రెండు తమిళ్ చిత్రాలు చేస్తుంది. నటిగా ఆమె బిజీగా ఉన్నారు.