CM Chandrababu : మళ్లీ ముఖ్యమంత్రి గానే ఈ సభలో అడుగు పెడతా.. అంతవరకు అవమాన భారంతోనే.. మీ పతనానికి పని చేస్తా’.. ఇలా చెప్పడం చేసింది ఎవరో తెలుసా సీఎం చంద్రబాబు. ఎప్పుడో తెలుసా 2021 నవంబర్ 19. చంద్రబాబు శపధానికి నేటితో మూడేళ్లు అవుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఈ శపధం ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ‘అసెంబ్లీ సాక్షిగా నా భార్యను అవమానించారు. నన్ను ఇష్టం వచ్చినట్లు దూషించారు’ అంటూ చంద్రబాబు నాడు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి గాని అసెంబ్లీకి వస్తా.. ఇది కౌరవ సభ.. గౌరవ సభ కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా నా అవమానాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. టిడిపి కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతం అయ్యారు. 2021 నుంచి ఆయన అసెంబ్లీలోనే అడుగుపెట్టలేదు. ఈ ఏడాది జూన్లో సీఎం గా ప్రమాణస్వీకారం చేసి హౌస్ లో అడుగు పెట్టారు.
* వీడియో వైరల్
చంద్రబాబు శపథం చేసి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోషల్ మీడియాలో టిడిపి శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. ఆ ఘటనను తాము ఇప్పటికీ మర్చిపోలేమంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు శపథం చేసి బయటకు వస్తున్న వీడియోను షేర్ చేస్తున్నారు. దటీజ్ చంద్రబాబు అంటూ చెప్పుకొస్తున్నారు.2021 నవంబర్ 19న అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. తన ప్రసంగానికి వైసీపీ సభ్యులు పదేపదే అడ్డుపడడంతో పాటు.. అసెంబ్లీలో తన భార్య ప్రస్తావన తీసుకురావడం పై ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేని ఒక మహిళను ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు అసెంబ్లీ వైపు చూడలేదు.
* దానినే హైలెట్ చేస్తున్న తమ్ముళ్లు
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నడూ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు టిడిపి శ్రేణులు. నాడు నారా భువనేశ్వరిని దారుణంగా అవమానించి.. నీచంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నాడు చంద్రబాబు పెట్టిన కన్నీరు మిమ్మల్ని ఇప్పుడు వెంటాడుతుందంటూ సవాల్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ పరిస్థితికి వైసిపి దిగజారిందో గుర్తు చేస్తున్నారు. మొత్తానికి అయితే మొన్నటికి మొన్నగా ఉన్న ఈ ఘటనకు సంబంధించి.. మూడేళ్లు పూర్తి కావడం విశేషం.
*చంద్రబాబు గారి శపథం నెరవేరిన రోజు.. కౌరవ సభ నుండి గౌరవ సభకు..✌️*#NarachandraBabuNaidu pic.twitter.com/jH3YrjA56H
— BheemBoy Eat millets Stay Healthy (@PITCHBOSS) June 4, 2024