Kids addicted to mobile: జనరేషన్ మారిపోవడంతో ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్ వాడుతున్నారు. రోజులో సగం మొబైల్‌తోనే సమయం గడుపుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడటం అసలు ఆరోగ్యానికి మంచిది కాదు. దీని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల కళ్లకు హాని జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయిన కూడా ఎవరూ వినకుండా మొబైల్ వాడుతూనే ఉంటారు. అయితే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకు బాగా మొబైల్ అలవాటు చేస్తున్నారు. తినడానికి మారం చేసినా, చెప్పిన మాట వినడం లేదని, తల్లిదండ్రుల పనులకు ఆటంకం కలగకూడదని కొందరు పిల్లలకు మొబైల్ ఇస్తారు. దీంతో పిల్లలకు మొబైల్‌కి బానిస అవుతారు. రెండేళ్ల నుంచే పిల్లలకు మొబైల్ అలవాటు చేయడంతో వారు దానికే అడిక్ట్ అవుతున్నారు. తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ప్రతి దానికి కూడా మొబైల్ కావాలని మారాం చేస్తారు. పిల్లలు ఏడుపు చూడలేక తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చేస్తారు. పిల్లలు ఇలా ఎక్కువగా మొబైల్ వాడటం వల్ల కళ్ల సమస్యలు రావడంతో పాటు మానసిక సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ఎలా అయిన కూడా మొబైల్ అడిక్ట్ నుంచి విముక్తి చేస్తే వాళ్లు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు. మరి పిల్లలను మొబైల్ అడిక్ట్ నుంచి విముక్తి చేయాలంటే తల్లిదండ్రులు కొన్ని చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్నేహితులను పరిచయం చేయండి
పిల్లలను ఎవరితో మాట్లాడనివ్వకుండా, బయటకు పంపకుండా కొందరు తల్లిదండ్రులు గారాబంగా పెంచుతారు. ఒంటరిగా ఫీల్ అయ్యి ఎక్కువగా మొబైల్‌కి అడిక్ట్ అవుతారు. కాబట్టి పిల్లలు ఒంటరిగా ఉండకుండా వారికి స్నేహితులను పరిచయం చేయాలి. వాళ్లతో లేదా కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపేలా చూడండి. వాళ్లు రోజురోజుకి మొబైల్ అడిక్ట్ నుంచి విముక్తి అవుతారు.
బొమ్మలు ఎక్కువగా ఇవ్వడం
సాధారణంగా పిల్లలకు బొమ్మలు అంటే ఇష్టం ఉంటుంది. మొబైల్‌తో గేమ్స్ ఆడించడం కంటే పిల్లలకు ఇంట్లో ఉండే బొమ్మలు, వస్తువులతో ఆడిస్తే వారికి మొబైల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అలాగే పిల్లలను బయటకు ఆడుకోవడానికి పంపించాలి. ఇలా చేయడం వల్ల వారి మైండ్ డైవర్ట్ అవుతుంది. దీంతో మొబైల్‌లో ఆడుకోవడం కంటే స్నేహితులతో ఆడుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ఎంత బిజీగా ఉన్న కాస్త సమయం వెచ్చించి పిల్లలతో మీరే ఆడుకోండి. లేకపోతే వారిని ఆడించండి. ఇలా చేస్తే పిల్లలు మారుతారు.
ఇంట్లోనే చిన్న చిన్న బాధ్యతలు ఇవ్వడం
ఇంట్లో మీరు ఏవైనా పనులు చేస్తే పిల్లలు ఇబ్బంది పెట్టకూడదని మొబైల్ ఇస్తారు. చివరికి ఇదే వారికి అలవాటుగా మారుతుంది. కాబట్టి మీరు పనులు చేసేటప్పుడు పిల్లలకు కూడా ఏదైనా చిన్న బాధ్యతలు చెప్పండి. ఇలా చేయడం వల్ల వారి మనసు మారుతుంది. మీరు ఇచ్చిన పని చేయాలనే బాధ్యత తెలియడంతో పాటు మొబైల్ గురించి కూడా మర్చిపోతారు. అక్కడ పెట్టిన వస్తువు తీసుకురా, అక్కడ పెట్టు అని ఇలా చిన్న చిన్న పనులు చెప్పాలి. వాళ్లను ఒంటరిగా వదలకుండా ఎక్కువ సమయం తల్లిదండ్రులతో గడిపేలా పిల్లలను చూసుకోండి.
మొబైల్ మంచిది కాదని ప్రాక్టికల్‌గా చెప్పడం
మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల కంటి సమస్యలు వస్తాయని, మానసిక సమస్యలు వస్తాయని పిల్లలకు చెబితే అర్థం కాదు. వాళ్లకి అర్థమయ్యేలా తల్లిదండ్రులే పిల్లలకు చెప్పాలి. దాని నుంచే వచ్చే రేడియేషన్ వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయని ప్రాక్టికల్‌గా చూపించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు మొబైల్ అడిక్ట్ నుంచి బయట పడతారు.