MG Comet EV : నేటి కాలంలో ప్రతి ఇంట్లోకారు ఉండాలని కోరకుంటున్నాటు. టూ వీలర్ తో పాటు ఫోర్ వీలర్ కూడా ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. కాస్త ఖరీదైన ఇళ్లల్లో అయితే ఒకటికి మించి కార్లు ఉంటున్నాయి.అయితే చిన్న ఫ్యామిలీ సైతం తమకు కారు ఉండాలని అనుకున్నప్పుడు లోబడ్జెట్ కారు ఏదో తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఇలాంటి వారి కోసం తక్కువ ధరతో కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వీరితో పాటు కొందరు మహిళలు బయటకు వెళ్లే సమయంలో కారు ఉండాలని అనుకుంటున్నారు. ఈ సందర్భంలో ఇంట్లో రెండో కారు కావాలని అనుకున్నప్పుడు లో బడ్జెట్ కార్ల కోసం చూస్తుంటారు. ఈ లో బడ్జెట్ కారు ఈవీ ది అయితే మరింత ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈవీల్ల లో బడ్జెట్ కార్లు చాలా అరుదుగా ఉన్నాయి. కానీ ఈ కంపెనీ మాత్రం ధరను తగ్గించి మరీ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ కారు ఏదంటే?
ఇప్పుడంతా ఈవీల దే హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో కొత్త ఈవీని కొనుగోలుచేయాలని అనుకుంటున్నారు. అయితే కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ప్రీమీయం ధరకు దగ్గరగా ఉన్నాయి. మరోవైపు చార్జింగ్ పాయింట్లు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది వీటి కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు. కానీ కొన్ని కంపెనీలు ఈవీల సేల్స పెంచుకునేందుకు వినియోగదారులను ఆకర్షించేలా తక్కువ ధరకే అందిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల ఎక్కువగా కోరుకుంటున్న ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లను తీసుకొస్తున్నాయి.
మాన్యువల్ గేర్ బాక్స్ కంటే ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కారుకు ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. నగరాల్లో కారు నడిపేవారికి ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈజీ డ్రైవింగ్ కోరుకునేవాళ్లు ఆటోమేటిక్ కారును కొనుగోలు చేయాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్లు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. తాజాగా ఎలక్ట్రిక్ వాహనంతో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కలిగిన ఓ కారు ధరను భారీగా తగ్గించారు. దీంతో ఈ కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారు.
ఎంజీ మోటార్స్ కు చెందిన పలు కార్లు మార్కెట్లో ఇప్పటికే వచ్చాయి. వీటిలో ఎంజీ కామెట్ ఈవీ ఒకటి. భారత్ లో అత్యంత చౌకైన కారుగా పేరు తెచ్చుకున్న ఈ ఈవీ చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ దీని డిజైన్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆటోమేటిక్ కారు కొనాలనుకునేవారు ఇప్పుడు ఎక్కువగా ఎంజీ కామెట్ ఈవీ వైపు చూస్తున్నారు. ఇందులో ఆకర్షించే ఫీచర్లతో పాటు సామాన్యులకు దగ్గరలో ధర ఉంది.
ఇప్పటి వరకు ఎంజీ కామెట్ ఈవీని రూ. 6.99 లక్షలతో విక్రయించారు. కాీన ఇటీవల బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ కింద దీనిని రూ.4.99 లక్షలకే అందిస్తున్నారు. బ్యాటరీ ఆప్షన్ లేకుండా కిలోమీటర్ కు అద్దె చెల్లించవచ్చు. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ ప్యాక్ ఉంటే ధర ఎక్కువగా ఉంటుంది. కానీ తక్కువ అవసరాలతో పాటు మహిళలు ఎక్కువగా వినియోగించటం కోసం దీనిని ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గా మార్చారు. ఇందులో ఎల్ ఈడీ లైట్ బార్లు, డే టైమ్ రన్నింగ్ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.