https://oktelugu.com/

Koratala Shiva: దేవర తో కొరటాల పరిస్థితి ఏంటి..? స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో ఆయన ఎక్కడ ఉన్నాడు…

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతోంది. ఇండియన్ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ రావాలన్నా కూడా అది తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్లే అవుతుంది అంటూ మన మేకర్స్ చాలా మంచి సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 9, 2024 / 11:56 AM IST

    Junior NTR- Koratala Shiva

    Follow us on

    Koratala Shiva: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులందరు వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. నిజానికి వాళ్ళు చేస్తున్న సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకుంటున్నారు. ఇక కెరియర్ మొదట్లో వరుసగా సక్సెస్ లను అందుకున్న చిరంజీవి ఆయన చేసిన ఆచార్య సినిమాతో ఒక్కసారిగా డీలా పడిపోయాడు. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆయన అప్పటిదాకా సంపాదించుకున్న క్రేజ్ మొత్తం ఒక్కసారిగా నేలమట్టం అయిపోయింది. ఇక ఈ సందర్భంలో ఆయన ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమా సక్సెస్ ని సాధించడంతో మరోసారి ఆయన పేరు పాన్ ఇండియా రేంజ్ లో వినిపిస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేయబోతున్నారు.

    ఇక తన తదుపరి సినిమా ఎవరితో ఉండబోతుందనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు గాని మరోసారి ఆయన స్టార్ హీరో తోనే సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్ తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి వాళ్ళందరిలో కొరటాల శివ ఉన్నాడు ఏ స్థానం లో ఉన్నాడు అనే దానిమీద కూడా ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. నిజానికి దేవర సినిమా సక్సెస్ సాధించినప్పటికి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకునే రేంజ్ లో అయితే సినిమా లేదని సినిమా మీద మొదటి నుంచి నెగిటివ్ టాక్ అయితే వస్తుంది.

    ఇక ఎన్టీఆర్ తన పర్ఫామెన్స్ తో సినిమాను నిలబెట్టాడు తప్ప కొరటాల పెద్దగా ఈ సినిమాలో మ్యాజిక్ అయితే ఏమీ చేయలేదు అంటూ ఒక వర్గం ప్రేక్షకులు కొరటాల మీద కొంత వరకు ఫైర్ అవుతున్నారు. అయినప్పటికీ సినిమా సక్సెస్ అయింది. కాబట్టి కొరటాల శివ కూడా పాన్ ఇండియా డైరెక్టర్లలో తనకంటూ ఒక స్థానాన్ని అయితే దక్కించుకున్నాడు. ఇక రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ లాంటి స్టార్ డైరెక్టర్ల లిస్టులో తను కూడా చేరిపోవడం అనేది ఒక మంచి విషయం అనే చెప్పాలి…ఇక పాన్ ఇండియాలో తెలుగు సినిమా దర్శకులే ఎక్కువగా గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు…