Jobs in Andhra Pradesh: ఏపీ వైద్య విధాన పరిషత్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 124 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈసీజీ టెక్నీషియన్, ఫిజియో థెరపిస్ట్ ఉద్యోగ ఖాళీలతో పాటు ల్యాబ్ అటెండెంట్, రేడియోగ్రాఫర్, ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 15,000 రూపాయల నుంచి 52,000 రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతను కలిగి ఉంటారు. ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, ఎమ్మెస్సీతో పాటు పదోతరగతి పాసైన వాళ్లు కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
Also Read: ఉక్రెయిన్ చేసిన తప్పేంటి.? ఎందుకీ పరిస్థితి..? ఆ దేశాల పాపమే శాపమైందా?
అనుభవం, రిజర్వేషన్, ఇంటర్వ్యూ, మెరిట్ ను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉండనుంది. ఆఫ్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.
ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కాగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.
Also Read: భీమ్లానాయక్ రాజకీయం.. కేసీఆర్ అలా.. జగన్ ఇలా.. ఏంటీ రచ్చ..?
Recommended Video: