Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. “గంగూబాయి కతీయవాడి” బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. భారీ అంచనాలు నడుమ ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి.. “RRR ” టీం తమ స్పెషల్ విషెష్ ని తెలియజేసారు. మా డియరెస్ట్ ఆలియా అండ్ గంగూబాయి టీమ్ కి బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నామని “RRR ” టీం ట్విట్టర్ వేదికగా తెలిపారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ నుంచి ‘ఈ రాతలే..’ వీడియో సాంగ్ రిలీజైంది. ఇప్పటికే లిరికల్‌గా సూపర్‌హిట్ అయిన ఈ పాటలోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. 1970ల కాలం నాటి ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయనున్నారు.
Also Read: రివ్యూ : గంగుభాయ్ కథియావాడి

ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. భీమ్లానాయక్ బెనిఫిట్ షో ఉందంటూ ఈశ్వరసాయి థియేటర్లో ముందుగా టిక్కెట్లు విక్రయించారు. సినిమా ప్రదర్శించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకో టిక్కెట్ రూ.300 నుంచి 500 వందలు దాకా తీసుకున్నట్లు తెలిసింది. ఉదయం 10.30 గంటలకు షో ఉంటుందని.. ఆ ఆటకు టికెట్లు ఉపయోగించుకోవాలని థియేటర్ యాజమాన్యం సూచించింది. కోపంతో థియేటర్‌పై రాళ్లు రువ్వారు.
Also Read: జగన్ పై ‘భీమ్లానాయక్’ మూవీలో పవన్ సంచలన సెటైర్లు? వైరల్