Gangubai Kathiawadi Movie Review: నటీనటులు అలియా భట్, విజయ్ రాజ్, శంతను మహేశ్వరి, అజయ్ దేవగన్ తదితరులు.
దర్శకులు : సంజయ్ లీలా భన్సాలీ
నిర్మాత : జయంతి, సంజయ్ లీలా భన్సాలి
సంగీతం : సంచిత్ బల్హారా
సినిమాటోగ్రఫీ : సుదీప్ చటర్జీ
బ్యానర్ భన్సాలి ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్

‘సంజయ్‌లీలా భన్సాలీ’ సినిమా అంటేనే… భారీ తనంతో మిళితమైన ఓ వైవిధ్యభరితం. అలాంటి గ్రేట్ విజువల్ డైరెక్టర్ దర్శకత్వంలో ‘గంగూభాయ్ కతియావాడీ’గా కనిపించి అలరించింది అలియా భట్. కాగా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరీ ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.
Also Read: పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ ట్విట్టర్ రివ్యూ
కథ :
గంగూబాయ్ గుజరాత్ లోని ఓ ఉన్నతమైన కుటుంబంలో పుడుతుంది. అయితే, తన తండ్రి దగ్గర పనిచేసే గుమాస్తాను ఆమె ప్రేమించి అతనితో ముంబయ్ పారి పోయి వస్తోంది. ఆ తర్వాత గంగూబాయి భర్త ఆర్ధిక ఇబ్బందులతో కామాటిపురాలోని వేశ్యా వాటికకు ఆమెను అమ్మేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అక్కడ ఆమెకు మాఫియా లీడర్లతో పరిచయం అవుతుంది. ఆ పరిచయాలవల్ల కామాటిపురా ఆమె చేతికి వస్తుంది. దాంతో అక్కడి వేశ్యల అభ్యున్నతికి ఆమె ఎలా కృషి చేసింది ? మధ్యలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? ఆమె తన జీవితంలో ఏమి నష్టపోయింది..? అనేది మిగిలన కథ.
విశ్లేషణ :
ఈ సినిమాలో ప్రధానంగా అలియా గెటప్, క్యారెక్టర్ అండ్ సెటప్ అదిరిపోయాయి. ‘గంగూభాయ్’ పాత్రలో అలియా భట్ మమైక పోయింది. కట్టుబొట్టుతో పాటు మాటతీరు, చూపుల తీరులో అచ్చం ‘గంగూభాయ్’లా అలియా కనిపించింది. సినిమాలో కథా గమనాన్ని కూడా బాగా ఎలివేట్ చేశారు.
ఇక కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో అనుకోకుండా చిక్కుకున్న ఒక సాధారణ అమ్మాయి.. ఆ తర్వాత తన చాతుర్యంతో గంగూబాయిగా ఎదిగి.. ఆ ఏరియాకి రాజకీయ నాయకురాలిగా ఎలా ఎదిగింది ? ఎవర్ని ఎలా ఎదిరించింది ? అనే కోణంలో సాగిన ఈ సినిమా బాగానే ఉంది.

సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ‘కామాఠిపురలో ప్రతిరాత్రి ఓ పండగే.. ఎందుకంటే అక్కడ గంగూబాయ్ ఉంటుంది’ అనే డైలాగ్‌తో పాటు.. ‘కామాఠిపుర రజియా భాయ్ సొంతం’ అనే డైలాగ్స్ బాగున్నాయి. చాలా చిన్న వయస్సులోనే గంగూబాయి లాంటి బరువైన పాత్రను పోషించి ఔరా అనిపించింది అలియా.
మిగిలన పాత్రల్లో నటించిన అజయ్ దేవగన్, హుమా ఖురేషి, ఇమ్రాన్ హస్మీ బాగా నటించారు. సంచిత్ బల్హారా సంగీతం కూడా బాగుంది. సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీని బాగా హ్యాండిల్ చేశారు, సంజయ్ లీలా భన్సాలి ఎడిటింగ్ సినిమాకి ప్లస్ అయ్యింది.
ప్లస్ పాయింట్స్ :
అలియా నటన,
మిగిలిన నటీనటులు నటన,
కథ కథనాలు,
క్లైమాక్స్,
సంగీతం,
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ నేటివిటీలో రెగ్యులర్ ప్లే ఉండటం.
కొన్ని సీన్స్ ఆసక్తికరంగా సాగకపోవడం,
స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ బాగాలేకపోవడం,
సినిమా చూడాలా ? వద్దా ?
ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఇష్టపడతారు. కాకపోతే, మెలో డ్రామాకి పరాకాష్టగా ఉండే ఈ సినిమా.. నేటి డిజిటల్ జనరేషన్ కి మరియు ఓటీటీ ప్రేక్షక లోకానికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అన్నదే ప్రశ్న. ఓవరాల్ గా ఓ వర్గం ప్రేక్షకులను మాత్రం ఈ చిత్రం ఆకట్టుకుంది.
రేటింగ్: 2.75 / 5
Also Read: భీమ్లానాయక్ టికెట్ రేట్స్ చూస్తే మీ గూబ గుయ్ మంటది?
[…] Also Read: రివ్యూ : గంగుభాయ్ కథియావాడి […]