Amazon Great Freedom Festival Sale: అమెజాన్ తన రాబోయే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 సేల్ తేదీలను ప్రకటించింది. ఈ సేల్ లో ఇంటి కోసం కావాల్సిన ప్రతి వస్తువును భారీ డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు. కొత్త వస్తువులు కొనాలని లేదా మీ కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే అప్పటి కల్లా లిస్ట్ రెడీ చేసుకోని పెట్టండి. అమెజాన్ సేల్ వచ్చే నెల మొదలవుతుంది. ఈ సేల్ ప్రారంభం కావడానికి ఇక చాలా తక్కువ సమయం ఉంది. సామాన్య కస్టమర్ల కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి సేల్ మొదలవుతుంది. అయితే, అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు మాత్రం 12 గంటల ముందుగానే సేల్‌లోకి ఎంట్రీ లభిస్తుంది. ఈ అర్లీ యాక్సెస్ పొందాలనుకుంటే ప్రైమ్ మెంబర్‌షిప్ కొనుగోలు చేసి ఈ బెనిఫిట్ పొందవచ్చు.
అమెజాన్ ఈ సేల్ కోసం ఒక స్పెషల్ పేజీని రెడీ చేసింది. దానిని చూస్తుంటే సేల్ టైంలో ట్రెండింగ్ డీల్స్, రాత్రి 8 పీఎం డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో బ్లాక్‌బస్టర్ డీల్స్ వంటి ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయని తెలుస్తోంది. సేల్‌లో మరింత ఎక్కువ డిస్కౌంట్ పొందడానికి అమెజాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసింది. దీని అర్థం ఏమిటంటే, సేల్ సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ తో బిల్లు చెల్లిస్తే, మీకు 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఫుల్ పేమెంట్‌తో కొన్న వస్తువులపైన, ఈఎంఐ ద్వారా కొన్న వస్తువులపైన కూడా వర్తిస్తుంది. బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్‌తో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వడ్డీ లేని ఈఎంఐ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
సేల్‌కు ముందుగానే యాక్సెస్ పొందాలనుకునే వాళ్ల కోసం అమెజాన్ కొన్ని ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌లను అందిస్తోంది.
Also Read: ఫ్లిప్ కార్డ్ ఫ్రీడమ్ సేల్.. స్మార్ట్‌ఫోన్‌లపై రూ.వేలు ఆదా చేసుకోండి.. ఎప్పటి నుంచి అంటే?
* ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ : దీనికి సంవత్సరానికి రూ.399 చెల్లించాలి. ఈ ప్లాన్‌తో మీకు అన్ లిమిటెడ్ ఫ్రీ డెలివరీ, అదే రోజు లేదా ఒక రోజులో డెలివరీ, సేల్‌కు ముందే యాక్సెస్, అమెజాన్ పే క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి.
* ప్రైమ్ లైట్ ప్లాన్ : దీనికి సంవత్సరానికి రూ.799 చెల్లించాలి. ఇది ఒకే డివైజ్ యాక్సెస్ అందిస్తుంది.
* అత్యంత ఖరీదైన ప్లాన్: ఈ ప్లాన్ ధర రూ.1499 (ఏడాదికి). ఈ ప్లాన్‌తో మీరు 5 డివైజ్‌లలో యాక్సెస్ పొందవచ్చు. సేల్‌కు ముందే యాక్సెస్ తో పాటు, ప్రైమ్ వీడియో సహా అనేక ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.