Flipkart Freedom Sale 2025: కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు కొనాలని అనుకుంటున్నారా.. మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి తన అతిపెద్ద సేల్‌లలో ఒకటైన ఫ్రీడమ్ సేల్ 2025ను తీసుకురాబోతోంది. ఈ సేల్ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ మెగా సేల్‌లో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై అదిరిపోయే ఆఫర్లు లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ ప్రకారం.. ఈ సేల్ ఆగస్టు 1, 2025 నుండి ప్రారంభమవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో మాత్రం సేల్ ఆగస్టు 2, 2025 నుండి మొదలవుతుందని చూపిస్తోంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే స్పష్టమైన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ గురించి కొన్ని ముఖ్య వివరాలను ఇప్పటికే ఖరారు చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, VIP యూజర్‌లకు సేల్‌కు 24 గంటల ముందే యాక్సెస్ లభిస్తుంది. అంటే, వీరు సేల్ అధికారికంగా ప్రారంభమయ్యే ముందు రోజే తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా, వీరికి అదనపు డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్ ఉపయోగించి 10 శాతం ఎక్స్ ట్రా డిస్కౌంట్ పొందవచ్చు. సెలక్ట్ చేసిన బ్యాంక్ కార్డులతో చెల్లిస్తే 15 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. ఈ సేల్‌లో ఆపిల్ ఐఫోన్‌లు, శామ్‌సంగ్, నథింగ్ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి.
Also Read: కోకో కోలా, పెప్సికో ను దెబ్బకొట్టే ప్లాన్.. సౌదీ అరేబియా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ జ్యూస్ ఏంటంటే?
ఈ ఫ్రీడమ్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ మొత్తం 78 ప్రమోషనల్ విండోలను ప్రారంభించనుంది. ఇవి వేర్వేరు సమయాల్లో యాక్టివేట్ అవుతాయి. ముఖ్యమైన ఆఫర్ సెక్షన్లు కొన్ని ఉంటాయి. అవి..
* ఫ్రీడమ్ డీల్స్ : ఇవి అత్యధిక డిస్కౌంట్‌లను అందించే ప్రధాన ఆఫర్లు.
* రష్ అవర్స్ : ఇవి లిమిటెడ్ టైం మాత్రమే అందుబాటులో ఉండే ఆఫర్లు. త్వరగా కొనుగోలు చేయాలి.
* టిక్ టాక్ డీల్స్ : ప్రతి గంటకూ మారుతూ ఉండే డిస్కౌంట్లు. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.
* ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ : పాత ప్రొడక్టులకు బదులుగా కొత్తవి కొనుగోలు చేస్తే లభించే తగ్గింపులు.
* బంపర్ అవర్స్ : అత్యధిక డిమాండ్ ఉన్న ప్రొడక్టుల పై లభించే ఆఫర్లు
ఈ ఆఫర్ల పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్, వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్ అధీకృత స్టోర్‌ల ద్వారా ఈ ఆఫర్లను పొందవచ్చు. ప్లస్ మెంబర్ కాకపోతే ఇప్పుడే రిజిస్టర్ చేసుకొని ఎర్లీ యాక్సెస్ పొందవచ్చు.