Successful Indian Farmer Story: పోగొట్టుకున్నచోట వెతుక్కోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అసలు ఏమీ లేని దగ్గర వెతుక్కోవడం.. గొప్పగా అభివృద్ధి చెందడం.. అత్యంత కష్టమైన పని. ఆ పనిని ఇతడు అత్యంత ఇష్టంతో చేశాడు. మామూలుగా కాదు.. తరతరాలు కూర్చుని తిన్నప్పటికీ కరగని ఆస్తిని సంపాదించాడు. అలాగని ఇతడు ఐటి కంపెనీలు పెట్టలేదు. బంగారు గనులను తవ్వలేదు. అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడలేదు.. కష్టాన్ని నమ్ముకున్నాడు. భూమిని తల్లి లాగా ప్రేమించాడు. ఆ భూమి ఇచ్చిన బహుమానంతోనే ఇవాళ ఆగర్భ శ్రీమంతుడిగా ఎదిగాడు.
గూగుల్ తల్లిని బినోయి వాలమ్మెల్ ఎవరు అని అడిగితే.. పేజీలకు పేజీలు సమాచారం చూపిస్తుంది.. ఇతడు ఎలా ఇంత డబ్బు సంపాదించాడు అంటే.. భూమిని నమ్ముకోవడం ద్వారా అని చెబుతోంది. ఇది ఎలా సాధ్యమైందని అడిగితే.. కథలు కథలుగా చెబుతుంది. బినోయ్ ది కేరళ రాష్ట్రం. అతడు పేద కుటుంబంలో పుట్టాడు. అంతంతమాత్రమే చదువుకున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగోలేక తోటమాలిగా పనిచేశాడు. అదే అతడికి పనికి వచ్చింది. ఆ అనుభవం అతడిని వ్యాపారిగా మార్చింది..
Also Read: ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి ఐడియాలు.. ట్రాక్టర్ను ఏకంగా రోడ్డు రోలర్గా మార్చేశాడు
కేరళ రాష్ట్రంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాలలో సహజమైన మృత్తికలు ఉంటాయి. ఇవి సహజ సిద్ధమైన యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క పంటకు అనుకూలంగా ఉంటాయి. ధైర్యం చేసి బినోయ్ కొంత ప్రాంతాన్ని కౌలుకు తీసుకున్నాడు. అందులో యాలకులు సాగు చేశాడు. ప్రారంభంలో నష్టాలు వచ్చే పంట సాగులో దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది.. దీంతో అతనికి నష్టాలు, కష్టాలు వచ్చాయి.. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్రమంలో స్నేహితుల సలహా అడిగాడు. దీంతో వారు మార్కెటింగ్ సదుపాయం, అధునాతన సాగు గురించి అతనికి చెప్పారు. దీంతో వారు చెప్పినట్టుగా అతడు చేయడం మొదలు పెట్టాడు. ఫలితంగా పంట దిగుబడి పెరిగింది. దీంతోపాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం ద్వారా లాభాలు వచ్చాయి. అంతేకాదు నష్టాలు మొత్తం క్రమేపి మాయమయ్యాయి. ఆ తర్వాత అతడు యాలకుల సాగును మరింత పెంచాడు. ఒకరకంగా యాలకుల వ్యాపారంలో తను మాత్రమే అన్నట్టుగా మారిపోయాడు. అలాగని వ్యాపారాన్ని అడ్డగోలు వ్యవహారం లాగా మార్చలేదు. ఈలోపు అతని కొడుకులు ఎదిగి వచ్చారు. తండ్రి వ్యాపారంలో చేదోడు వాదోడుగా నిలిచారు. అప్పటిదాకా వారి వ్యాపారం మన దేశానికి మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత అది ఇతర దేశాలకు విస్తరించడం మొదలుపెట్టింది. కుమారులు ఉన్నత విద్యావంతులు కావడంతో వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ముఖ్యంగా అరబ్ దేశాలకు తామ పండించిన యాలకులను ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. అక్కడి మారక ద్రవ్యం మన కరెన్సీ కంటే విలువైనది కావడంతో బినోయ్ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పదులకోట్ల నుంచి వందల కోట్లకు వ్యాపారం విస్తరించింది.
Also Read: రాత్రయితే చాలు వింత ఆకారాలు ఇక్కడ భయపెడుతున్నాయి..
ప్రస్తుతం బినోయ్ కుటుంబం ఆధ్వర్యంలో వందల ఎకరాలలో యాలకుల పంట సాగవుతోంది. వారికి సొంతంగా యాలకులను ప్రాసెస్ చేసే యూనిట్ ఉంది. కేరళలో పండిన యాలకులను తమ కర్మగారంలో శుద్ధిచేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. వారి కర్మాగారంలో వందలాదిమంది కార్మికులు పనిచేస్తుంటారు. యాలకుల వ్యాపారం ద్వారా కోట్ల సామ్రాజ్యాన్ని బినోయ్ కుటుంబం ఏర్పాటు చేసుకుంది. అంతేకాదు కేరళలో దాదాపు 27 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత ఖరీదైన పవనాన్ని నిర్మించుకుంది. ఈ భవనం కేరళ రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన గృహముగా పేరుపొందింది. దీని నిర్మాణానికి వందల కోట్లు ఖర్చయినట్టు తెలుస్తోంది. భవన నిర్మాణంలో అత్యంత ఖరీదైన ఉపకరణాలు వాడటంతో బంగారం లాగా మెరుస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక పేద కుటుంబంలో పుట్టిన బినోయ్ కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. చెమటను మాత్రమే విశ్వసించాడు. అంతేకాదు భూమిని ప్రేమించి తల్లిలాగా అక్కున చేర్చుకున్నాడు. ఈరోజు కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. వందలాది కుటుంబాలకు ఉపాధిగా మారిపోయాడు. అందుకే అంటారు రైతుకు మించిన తత్వవేత్త.. భూమిని మించిన భరోసా లేదని.. దానిని బినోయ్ నిరూపించాడు.