
దేశంలో వ్యాక్సిన్ల కొరతపై సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీకా నిల్వల ఏర్పాట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను ప్రభుత్వం విస్మరించిన కారణంగానే వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందన్నారు. టీకా డ్రైవ్ ను పెంచేటప్పుడు అందుబాటులో ఉన్న టీకా నిల్వను, డబ్ల్యూహెచ్ ఓ మార్గదర్శకాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని టీకా కార్యక్రమంలో భారత ప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నదని శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో జాదవ్ చెప్పారు.