నగరంలో లాక్ డౌన్ మరింత పకడ్బందీగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు సూచించారు. శనివారం ఆయన నగరంలోని పలుచోట్ల లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు. సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తో కలిసి కూకట్ పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. అనవసరంగా రోడ్డ పైకి వచ్చే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు […]
నగరంలో లాక్ డౌన్ మరింత పకడ్బందీగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు సూచించారు. శనివారం ఆయన నగరంలోని పలుచోట్ల లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు. సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తో కలిసి కూకట్ పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. అనవసరంగా రోడ్డ పైకి వచ్చే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయాలన్నారు.