
ఒంటి పై యాసిడ్ పోసుకుని వ్యవసాయం ఉద్యోగిని ఉమాదేవి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఉమాదేవి కుమారుడు బాజీ కిరణ్ ఈ నెల 8న కరోనాతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబంలో ఆస్తుల విషయంలో వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఇవాళ తన కార్యాలయంలోని భూసార పరీక్ష కేంద్రంలో బాధితురాలు ఒంటిపై యాసిడ్ పోసుకున్నారు. గమనించిన స్థానికులు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉమాదేవి మరణించారు.