
ప్రముఖ షూటర్ శ్రేయాసి సింగ్ న్యూఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈమె 2018 కామన్వెల్త్ గేమ్స్ లో షూటింగ్ విభాగంలో స్వర్ణ పథకం గెలుచుకుంది. అంతేకాకుండా 2014లో స్కాట్లాండ్‌లోని గ్లాస్‌గోవ్‌లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్‌లో రజత పతకం గెలుచుకుంది. ఆమెకు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మర్‌పూర్ (బాంక), జముయి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.