Ram Charan Peddi movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చి బాబు మాట్లాడుతూ ‘పెద్దగా నేను ఏమి మాట్లాడను అండీ.. ఏప్రిల్ 30 న ఈ సినిమాని విడుదల చేయలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి, జూన్ 4న వస్తున్నందుకు మమ్మల్ని ఆశీర్వదించండి. మీ అందరి హృదయాలకు చాలా దగ్గరగా ఉంటాడు పెద్ది గాడు. మీ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. మీ హృదయాల నుండి పెద్ది గాడిని తీసేయడం అంత ఈజీ కాదు , ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ ని మీ ముందుకు తీసుకొని రాబోతున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు బుచ్చి బాబు. ఈ ప్రెస్ మీట్ కి డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
ఈ సినిమాకు ఆయన సహా నిర్మాతగా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి హోస్ట్ గా యాంకర్ స్రవంతి వ్యవహరించింది. ఆమె త్వరలోనే రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా గురించి సుకుమార్ ని అడిగే ప్రయత్నం చేయగా, ఆయన అందుకు సమాధానం చెప్తూ ‘ఈ ఈవెంట్ లో కేవలం పెద్ది గురించే మాట్లాడాడు , ఓన్లీ పెద్ది నే ‘ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రామ్ చరణ్ , సుకుమార్ కాంబినేషన్ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇకపోతే ఈ చిత్రం గురించి సుకుమార్ మాట్లాడుతూ ‘నిర్మాత సతీష్ కిలారి గారికి ఇది మొట్టమొదటి చిత్రం. మైత్రి మూవీ మేకర్స్ లో ఆయన నన్ను ప్రతీ రోజు చిరునవ్వుతో పలకరించేవాడు. అలాంటి వాడు ఒక్కసారిగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాడు , రేపు ఏదైనా తేడా జరిగితే అతనిలో ఆ చిరు నవ్వు ఉంటుందా అని అనిపించింది’.
‘కానీ ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నాను , ఒక బ్లాక్ బస్టర్ చిత్రం తో ఆయన నిర్మాతగా సినీ రంగం లోకి అడుగుపెట్టబోతున్నాడు. బుచ్చి బాబు అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడు. ఉప్పెన చిత్రం లోని క్లైమాక్స్ ని వాడు డీల్ చేసిన విధానం ని చూసే నేను ఫిక్స్ అయిపోయాను, వీడు ఎలాంటి సినిమాని అయినా తీయగలడు అని , పెద్ది తో అది నిరూపించాడు. ఎమోషన్స్ తో హృదయాలను హత్తుకునే సన్నివేశాలతోనే కాకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడు. ఇలాంటి చిత్రాలను తెరకెక్కించాలంటే చాలా కష్టం. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఆయన చేసిన అన్ని సినిమాల్లోని నటనతో పాటు , నేను దర్శకత్వం వహించిన రంగస్థలం నటన కూడా ‘పెద్ది’ ముందు పనికిరాదు. అంతటి అద్భుతంగా నటించాడు’ అంటూ చెప్పుకొచ్చాడు సుకుమార్.