తెలంగాణలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జిల్లాల్లలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని తెలిపింది.