
టోక్యో ఒలింపిక్స్ మహిళా విభాగం తుది మ్యాచ్ ముగిసింది. అతిధి అశోక్ నాలుగో స్థానంలో నిలిచింది. అయితే భారత ఖాతాలో పతకం పడకపోయినా.. ఫైనల్ లో గట్టి పోటీ ఇచ్చి ఆకట్టుకుంది. చివర్లో పతకం కు అవకాశాలకు కేవలం రెండు హోల్స్ ఉన్న సమయంలో వర్షంతో మ్యాచ్ నిలిపి వేశారు. కాసేపటికి తిరిగి ఆట మొదలైంది. నాలుగో రౌండ్ మ్యాచ్ లో తర్వాతి హోల్ లో నాలుగో పొషిషన్ కి పడిపోయింది. ఆపై ఒక్క షాట్ తేడాతో కాంస్యం తృటిలో చేజార్చుకుంది.