Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan : రీమేక్ అన్నారు.. లీకైంది అన్నారు.. కానీ 'జన నాయగన్' కి అడ్వాన్స్...

Jana Nayagan : రీమేక్ అన్నారు.. లీకైంది అన్నారు.. కానీ ‘జన నాయగన్’ కి అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఎంతంటే..

Jana Nayagan : ఒకప్పుడు టాక్ , డైరెక్టర్ , హైప్ తో సంబంధం లేకుండా సౌత్ ఇండియా లోని స్టార్ హీరోలకు తిరుగులేని ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి పోయింది. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాకు అయినా, ఆసక్తికరమైన కంటెంట్ లేకపోతే హైప్ క్రియేట్ అవ్వలేని పరిస్థితి ఏర్పడింది. పైగా ఈ పాన్ ఇండియా యుగం లో సరికొత్తగా ప్రయత్నం చెయ్యాలి , భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ ని తెరకెక్కించాలి , అప్పుడే ఆడియన్స్ ఓపెనింగ్స్ ని అందిస్తున్నారు. కానీ ఇవేమి లేకపోయినప్పటికీ కూడా, ఒక సినిమాకు క్రేజ్ , హైప్ ని రప్పించగల సత్తా ఉన్న ఏకైక హీరో ప్రస్తుతం ఎవరైనా ఉన్నారా అంటే , అది తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాత్రమే. సినిమా గ్లామర్ తో ఏకంగా ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడంటే, ఆయన క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఆయన హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. మన తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది రీమేక్. ఎప్పుడో జనవరి 9 న విడుదల అవ్వాల్సిన సినిమా ఇది. కానీ సెన్సార్ సభ్యులు ఈ సినిమాలోని అనేక సన్నివేశాలకు అడ్డం చెప్తూ , సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం తో విడుదల ఆపేయాల్సి వచ్చింది . ఇక అప్పటి నుండి సెన్సార్ క్లియరెన్స్ రావడానికి ఆరు నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని , ఈ నెల 23 న ప్రాంపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళం మరియు మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నెమ్మదిగా ఒక్కో ప్రాంతం లో ప్రారంభిస్తున్నారు. ముందుగా కర్ణాటక లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు.

అప్పుడే 30 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి , గ్రాస్ వసూళ్లు 2 కోట్ల 50 లక్షల వరకు వచ్చిందట. నిన్న కేరళ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. కేవలం 2 గంటల్లోనే కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన గ్రాస్ 5 కోట్ల 11 లక్షల రూపాయిలు అట. 1,56,352 టికెట్స్ అమ్ముడుపోయాయి అట. ఇది కేవలం ఆరంభం మాత్రమే పూర్తి స్థాయి బుకింగ్స్ ప్రారంభం అవ్వలేదు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ప్రారంభించాల్సి ఉంది. అవి మొదలయ్యాక ఏ రేంజ్ గ్రాస్ వస్తుందో చూడాలి. విడుదలకు ముందే ఆన్లైన్ లో ఈ చిత్రం లీక్ అయ్యినప్పటికీ కూడా, ఈ రేంజ్ బుకింగ్స్ జరుగుతున్నాయంటే విజయ్ ని మించిన సౌత్ ఇండియన్ హీరో ప్రస్తుతానికి లేరని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular