
కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో భారత్ తమకు అండగా నిలిచిందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పునరుద్ఘాటించారు. భారత్ సాయాన్ని అమెరికా ఎప్పటికి మరువలేదన్నారు. ప్రస్తుతం కరోనాతో సతమతమవుతున్న భారత్ కు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే అనేక అంశాల్లో భారత్, అమెరికా పరస్పర సహకారంతో కలిసి ముందుకు సాగుతాయని ధీమా వ్యక్తం చేశారు. కొవిడ్ మహమ్మారిపైనా కలిసే పోరాడుతామని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్ శుక్రవారం బ్లింకెన్ తో భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.