
దేశంలో కరోనా కల్లోలం తగ్గుతున్నది. వరుసగా రెండో రోజు రెండు లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,73,790 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. 45 రోజుల తర్వాత రోజువారీ కేసులు కనిష్ట స్థాయికి చేరాయి. ఈ నెల మొదట్లో నాలుగు లక్షలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు ప్రస్తుతం భారీగా తగ్గాయి. కొత్తగా 2,84,601 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మరో 3,617 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247కు పెరిగాయి.