
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద అంతకంతకూ పెరగడంతో పోచమ్మ గుండి వద్ద ఉన్న గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. దీంతో దర్శనాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఆలయాన్ని అనుకొని ఉన్న ఇళ్లన్నీ నీట మునిగాయి. ఫలితంగా బాధిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. దేవీపట్నం, తొయ్యేరు మధ్య ఆర్ అండ్ బీ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.