
ఇసుక రీచ్ ల సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మించి రూ. కోట్టు వసూలు చేశాడు ఓ మోసగాడు. కాకినాడకు చెందిన రామకృష్ణ సతీష్ కుమార్ తనకు జేపీ గ్రూప్ నుంచి ఇసుక రీచ్ ల కాంట్రాక్ట్ వచ్చిందని నమ్మించి పలువురి నుంచి భారీగా నగదు వసూలు చేశాడు. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ దస్త్రాలు స్పష్టించినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు వసూలు చేసి సబ్ లీజ్ ఇవ్వకనోవటంతో బాధితులు జేపీ గ్రూప్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న జేపీ గ్రూప్ సంస్థ మేనేజర్ పోలీస్ స్టేషన్ లో ఫర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇసుక రీచ్ ల పేరుతో రూ. 3.5 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.