
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో కానిస్టేబుల్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. నోవాపాన్ కూడలిలో బాచుపల్లి స్టేషన్ కానిస్టేబుల్ కనకయ్యపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఓ కేసు విషయంలో దేవీలాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు కానిస్టేబుల్ వెళ్లారు. ఈ క్రమంలో తాను పోలీస్ అని చెబుతున్న పట్టించుకోకుండా అతని ఐడీ కార్డు, ఫోన్ విసిరికొట్టి దాడి చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దేవీలాల్ తో పాటు దాడికి పాల్పడిన అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.