రాష్ట్రమంతా విస్తరించిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతా విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్రంలోకి నైరుతి రుతువపనాలు విస్తరించిన విషయం విదితమే. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉంది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి గాలులు వీచనున్నాయి. రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు […]

Written By: Suresh, Updated On : June 10, 2021 3:12 pm
Follow us on

నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతా విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్రంలోకి నైరుతి రుతువపనాలు విస్తరించిన విషయం విదితమే. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉంది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి గాలులు వీచనున్నాయి. రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.