ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కరోనా నుంచి రక్షణ పొందాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కేసీ తండాలో గవర్నర్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా కేసీ తండాలో గవర్నర్ రెండో డోసు టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ పూర్తిగా తెలుగులో ప్రసంగించారు. గిరిజన ప్రజలంటే తనకు చాలా అభిమానం, ప్రేమ అని చెప్పారు.