
మాజీమంత్రి ఈటల రాజేందర్ మోకాలికి వైద్యులు ఆపరేషన్ చేశారు. వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉంటారు. పది రోజుల తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉంటారు. పది రోజుల తర్వాత వైద్యుల సూచన మేరకు పాదయాత్రపై నిర్ణయం తీసుకోనున్నారు. జూలై 19న వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని కమలాపూర్ మండలం బత్తినివానిపల్లె నుంచి ప్రజాదీవెన పాదయాత్రను ఈటల ప్రారంభించారు. 12 రోజుల పాటు నిర్వహించారు. వీణవంక మండలంలోని కొండపాక వరకు పాదయాత్రగా వచ్చిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.