బాలీవుడ్ లో హమ్ ఆప్కే హై కౌన్ వంటి చిత్రాల సంగీత దర్శకుడు లక్ష్మన్ నాగ్ పూర్ లో శనివారం తుదిశ్వాస విడిచారు. గుండె పోటు కారణంగా చనిపోయినట్లు ఆయన కుమారుడు అమర్ తెలిపారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. 1942 సెప్టెంబరు 16న మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటున్న సమయంలో సోదరుడు సురేంద్ర పాటిల్ తో కలిసి రామ్ లక్ష్మణ్ గా తన పేర్లు మార్చుకున్నారు. మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై చిత్రాలకు సంగీతం అందించారు రామ్ లక్ష్మణ్.