
ఆర్టీసీలో జీతాలు ఆలస్యమవుతుండడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. నెల గడిచి 16 రోజులు అవుతున్నా ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడంతో పూట గడవడం ఇబ్బందిగా ఉందని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం కార్మికులు అన్ని డిపోలవద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కార్మికులు, ఉద్యోగుల ఆందోళనకు యూనియన్లు మద్దతు పలికి సంఘీభావం తెలుపుతున్నాయి.