
విద్యుదాఘాతంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వనస్థలిపురం ఎస్కేడీనగర్ కాలనీలో ఉంటున్న నాగరాజు విద్యుత్ మోటార్ రిపేర్ కు వచ్చింది. సాహెబ్ నగర్ కాలనీకి చెందిన కుంచం శ్రీనివాస్ (28) వచ్చి మోటార్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. నష్ట పరిహారాన్ని అందించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వనస్థలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.