Vivek Oberoi first look from Spirit: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటిస్తున్న చిత్రాల్లో అభిమానుల్లోనూ , ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘స్పిరిట్'(Spirit Movie). సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5 న విడుదల కాబోతుంది. అయితే సందీప్ వంగ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని చాలా డిఫరెంట్ గా విడుదల చేస్తున్నాడు. ముందుగా హీరో ప్రభాస్, త్రిప్తి దిమిరి కలిసి ఉన్న ఫోటో ని న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసాడు . దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సందీప్ వంగ స్టైల్ లో ప్రభాస్ ని చూసిన అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. ఇకపోతే ఈ చిత్రం లో విలన్ గా రక్త చరిత్ర హీరో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు.
ఇందులో హీరో ప్రభాస్ కి ఎలా అయితే జోడీ ఉందో , విలన్ వివేక్ ఒబెరాయ్ కి కూడా ఒక జోడీ ఉంది. ఆయనకు జోడిగా ఐశ్వర్య దేశాయ్ నటించబోతుంది. ఆమె కూడా ఈ ఫస్ట్ లుక్ లో కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకొని స్టైల్ గా కనిపించడం విశేషం. వీళ్లిద్దరు ఈ చిత్రంలో సైకో కిల్లర్స్ గా నటించబోతున్నారు. మొదట్లో ఈ రెండు పాత్రల కోసం సందీప్ వంగ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ , ఆయన సతీమణి కరీనా కపూర్ ని సంప్రదించారట. కానీ ఎందుకో వాళ్ళు ఈ పాటలు చేయడానికి ఇష్టపడకపోవడం తో వివేక్ ఒబెరాయ్ , ఐశ్వర్య దేశాయ్ లను తీసుకున్నారు. ఐశ్వర్య దేశాయ్ గతం లో ‘గల్లీ బాయ్’ , ‘ర్యాట్ ఇన్ ది కిచెన్ ‘ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది.
Also Read: తమిళ హీరో విజయ్ తో విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కిన సంగీత..వీడియో వైరల్!
ఇప్పుడు ఈ విలన్ రోల్ లో ఆమె ఎలా నటించబోతుంది అనేది చూడాలి. ఇందులో ప్రభాస్ వయొలెంట్ పోలీస్ ఆఫర్ క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. పోలీస్ అంటేనే మాస్, ఇక ఆ మాస్ సందీప్ రెడ్డి స్టైల్ తోడైతే ఏ రేంజ్ వయొలెన్స్ ని వెండితెర పై చూడొచ్చో మీ ఊహలకే వదిలేస్తున్నాం. ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే ఆయన ‘స్పిరిట్ ‘ షూటింగ్ లో పాల్గొంటాడు. ఇప్పటి వరకు ప్రభాస్ ఈ సినిమా కోసం కేవలం నాలుగు రోజులు మాత్రమే పని చేశాడు. త్వరలో డెహ్రాడూన్ లో జరగబోయే భారీ షెడ్యూల్ లో పాల్గొని ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ ని చక చకా పూర్తి కానిస్తాడని అంటున్నారు.
And that’s @vivekoberoi from #Spirit
In Cinemas across the World on March 5th, 2027.#OneBadHabit@InSpiritMode#Prabhas @imvangasandeep @tripti_dimri23 #AishwaryaDesai @rameemusic @sureshsrajan #BhushanKumar @vangapranay #KrishanKumar @ShivChanana @neerajkalyan_24… pic.twitter.com/U98fxyH7Yv
— Spirit (@InSpiritMode) February 27, 2026