
పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి యావజ్జీర కారాగార శిక్ష పడిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూజీ రాజ్ స్థాన్ హైకోర్టులో బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో చికిత్స చేయించుకునేందుకు తనకు బెయిలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్ పాజిటివ్ బారిన పడిన ఆశారాం జోథ్ పూర్ లోని ఎయిమ్స్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తనకు కోవిడ్ అనుకుంటున్నట్లు ఆయన తన బెయిల్ దరఖాస్తులో తెలిపారు.