
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. వైరస్ నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ పాజిటివ్ రావడంతో మరికొన్ని రోజులు భారత్ లోనే ఉండాల్సి ఉంటుంది. ఆసీస్ క్రికెటర్ చెన్నైలోని ఓ హోటల్ లో ఐసోలేషన్ లోనే ఉంటున్నాడు. హస్సీతో పాటు చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ క్లీనర్ కు మే 3న కరోనా సోకింది.