కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు విచిత్ర అనుభూతి ఎదురైంది. కార్యకర్తల నుంచి కొత్త రాగం వినిపించింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి తమ్ముళ్ల నోట జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించింది. శాంతిపురంలో నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబుకు కార్యకర్తల నుంచి ఆసక్తికర, ఆశ్చర్యకర డిమాండ్ ఎదురైంది. కుప్పానికి జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ తరపున తీసుకురావాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన్ను తిప్పాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి రావడంతో చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయ్యింది.
Also Read: ఏపీలో కొత్త కొలువులకు బ్రేక్ : జగన్ నిర్ణయంతో కన్ఫర్మ్
ఈ డిమాండ్ చంద్రబాబును కలవరానికి గురి చేస్తోంది. ఈ అనూహ్య పరిణామానికి చంద్రబాబు షాక్‌కు గురయ్యారు. ఏం సమాధానం చెప్పాలో ఆయన నోట మాటరాలేదు. అధినేత నుంచి ఎలాంటి స్పందన కూడా లేకపోవడంతో కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకురావాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రావాలంటే, టీడీపీ నుంచి ఎవరు పోవాలి? ఇప్పుడిదే ప్రశ్న అందరి మనసుల్లో నానుతోంది. పుత్రరత్నం లోకేశ్‌ను రాజకీయ వారసుడిగా ముందుకు తేవాలని కలలు గంటున్న చంద్రబాబుకు ఇది ఊహించని షాక్‌లా మారింది.
లోకేష్‌ను రాజకీయ వారసుడిని చేయాలని చంద్రబాబు ఎంత తపిస్తున్నా ఆయనలో పెద్దగా ఆ నాయకత్వ లక్షణాలు కనిపించడం లేదు. తన అపరిపక్వత చేష్టలతో గ్రామస్థాయి నాయకుడిగా స్థిరపడిపోతున్నారనే ఆందోళన టీడీపీలో వ్యక్తమవుతోంది. లోకేశ్‌లో ఫైర్ కూడా కనిపించడం లేదనే విమర్శలు పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా.. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఎంతో బలంగా ఉందని ఇంత కాలం ప్రత్యర్థులు కూడా నమ్ముతూ వచ్చారు. కానీ.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలతో అక్కడా పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారిందని అర్థమైంది. ఇప్పటికైనా మేల్కోకపోతే తనకే ఎసరు పెట్టేలా ఉన్నారని చంద్రబాబు భయాందోళనకు గురై ఆయన కుప్పానికి ఆగమేఘాలపై వెళ్లారు.
Also Read: కాంగ్రెస్ సీనియర్ లీడర్ల ఐక్యతారాగం
ఎంతో ఉత్సాహంతో బాబు కుప్పం పర్యటన పెట్టుకున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ రావాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వస్తుందని ఆయన కూడా ఊహించి ఉండరు. ఇది ఆయనకు ప్రమాద సంకేతాలను ఇచ్చినట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు సహా లోకేశ్ వల్ల పార్టీ మనుగడ సాధ్యం కాదని, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనుమడు, చరిష్మా ఉన్న యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే దిక్కు అనే సంకేతాలు కార్యకర్తలు పంపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Jr ntr slogans during chandrababu road show in chittoor district
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com