Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy : మూడేళ్లు ఆగు.. సెల్యూట్ చేయిస్తా.. బాధితుడికి జగన్ భరోసా!*

YS Jagan Mohan Reddy : మూడేళ్లు ఆగు.. సెల్యూట్ చేయిస్తా.. బాధితుడికి జగన్ భరోసా!*

YS Jagan Mohan Reddy  : పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పడంలో తప్పులేదు కానీ.. కొద్ది రోజులు వెయిట్ చెయ్ అలానే చేద్దాం అంటూ చెప్పడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. పార్టీ శ్రేణుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. పోలీసులు తనను వేధించారంటూ ఓ యువకుడు చెప్పగా.. కొద్ది రోజులు ఆగు అదే పోలీసులతో నీకు సెల్యూట్ చేయిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గత ఐదేళ్లలో రెచ్చిపోవడానికి కారణం ఇదేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో పార్టీ శ్రేణుల దూకుడు తనానికి చెప్పి ఉంటే ఇప్పుడు వారు మూల్యం చెల్లించుకునేవారు కాదని అభిప్రాయపడుతున్నారు. వల్లభనేని వంశీ మోహన్, పోసాని కృష్ణ మురళి, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇటువంటి వారు అడ్డంగా బుక్ కావడానికి జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణమన్న టాక్ వినిపిస్తోంది.

Also Read : కర్నూలు కార్పొరేషన్ పై టిడిపి కన్ను.. టచ్ లోకి కార్పొరేటర్లు!

* సునీల్ యాదవ్ ఫిర్యాదుతో..
వైయస్ వివేకానంద రెడ్డి ( Y S Vivekananda Reddy )హత్య కేసులో ఏ 2 గా ఉన్న సునీల్ యాదవ్ ఇటీవల పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అత్యంత ఆత్మీయుడు. అయితే ఇటీవల వైయస్ వివేక హత్యపై హత్య అనే సినిమాను చిత్రీకరించారు. ఆ సినిమాలో తనతో పాటు తన తల్లిపాత్రను దారుణంగా చూపించారంటూ సునీల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సినిమాకు సంబంధించి వీడియోలను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. వైయస్ అవినాష్ అన్న యూత్ పేరిట నిర్వహిస్తున్న ఓ సోషల్ మీడియా గ్రూపులో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కేసులు నమోదు చేశారు. ఇటీవల పవన్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.

* డీఎస్పీ, సీఐపై ఆగ్రహం..
కాగా విచారణ పేరిట పవన్ కుమార్ పై( Pawan Kumar) పోలీసులు దాడికి దిగినట్లు బాధితుడు చెబుతున్నాడు. ఇదే విషయంపై జగన్మోహన్ రెడ్డికి విన్నవించాడు. పవన్ కుమార్ మాటలకు స్పందించిన జగన్ అతన్ని ఓదార్చారు. మూడేళ్లు వెయిట్ చేయాలని.. మనం అధికారంలోకి రాగానే ఆ డి.ఎస్.పి, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా. అప్పటివరకు ధైర్యంగా ఉండు అంటూ జగన్మోహన్ రెడ్డి అభయం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఎప్పుడు ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది. అయితే కేసు పూర్వాపరాలు తెలుసుకొని మరి.. తన పార్టీ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఆ తరహా భరోసా ఇవ్వడం అనేది మాత్రం చిన్న విషయం కాదు.

* జగన్మోహన్ రెడ్డిని నమ్మితే..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ శ్రేణుల నేటి పరిస్థితికి ముమ్మాటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి హాయిగా ఉన్నారు. ఆయన వరకు ఎటువంటి కేసులు లేవు. పాత కేసులు సైతం తిరగదోడేందుకు కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. ఎటోచ్చి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నోటికి పని చెప్పిన నేతలకు కూటమి టార్గెట్ చేస్తోంది. పార్టీ శ్రేణులు విలవిలలాడుతున్న సమయంలో వారికి ధైర్యం చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అలానే చేస్తున్నారు. అయితే మళ్లీ అధికారంలోకి వస్తే వారికి ప్రతాపం చూపుతామని చెప్పడం మాత్రం అభ్యంతరకరంగా ఉంది.

Also Read : స్కూటర్ మీద ఎమ్మెల్యే.. ఆయన మారడంతే!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular