IBPS bank jobs 2025: కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగాల భర్తీపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే పోస్టర్, రైల్వే, బ్యాంకింగ్ రంగంలోని ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇప్పటికే పోస్టర్, రైల్వే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. పలు బ్యాంకులు కూడా వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చాయి. తాజాగా ఐబీపీఎస్ ద్వారా 5 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది.
5,208 పోస్టులు..
దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి ఐబీపీఎస్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూలై 21 వరకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంది అభ్యర్థుల వయో పరిమితి 30 ఏళ్లు. రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం ఇలా..
ప్రిలిమినరీ పరీక్ష పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్(మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు) ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షకు గంట సమయం ఉంటుంది. వంద మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఇందులో క్వాలిఫై అయినవారిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంది.
మెయిన్స్ ఇలా…
ఇక మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు అబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ఇందులో రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవగాహన, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్, ఇంటర్‌ప్రెటేషన్ ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ (డిస్క్రిప్టివ్ – లెటర్ రైటింగ్ – ఎస్సే) ఉంటాయి. ఈ పరీక్షకు మూడు గంటల సమయం ఉంటుంది. డిస్క్రిప్టివ్ సెక్షన్ కోసం అదనంగా 30 నిమిషాల సమయం ఇస్తారు. మొత్తం 225 మార్కుల పరీక్ష ఉంటుంది. ఇందులో 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 25 మార్కులు డిస్క్రిప్టివ్‌కు ఉంటాయి. ఈ పరీక్ష అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
Also Read: Best Women Jobs: కుటుంబ జీవితం బాగుండాలంటే.. ఈ ఉద్యోగాలు చేయొద్దు..
తర్వాత ఇంటర్వ్యూ..
ప్రిలిమినరీ, మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇందులో వంద మార్కులు ఇస్తారు. బ్యాంకింగ్ రంగం, ఆర్థిక వ్యవస్థపై అవగాహన. వ్యక్తిగత నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్య పరిష్కార నైపుణ్యం పరిశీలిస్తారు.
పరీక్ష కేంద్రాలు..
ఇక ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష కేంద్రాల్లో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉంటాయి. అనుకూలమైన కేంద్రాలను అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. వివరాలకు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.