Guest Faculty Salaries Increase: తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల క్రితం మెడికోల స్టైఫండ్ భారీగా పెంచింది. చాలాకాలంగా స్టైఫండ్ పెంపు కోసం చేస్తున్న విజ్ఞప్తులపై ఎట్టకేలకు స్పందించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కూడా అక్కడి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీకి త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఈమేరకు కసరత్తు జరుగుతోంది.
Also Read: తల్లిదండ్రులు, సోదరుడు చనిపోయారు.. మూడేళ్లుగా ఆ రూం దాటి బయటకు రాలేదు.. ఓ టెకీ విషాద గాథ
ఏపీలో 1,600 మంది గెస్ట్ ఫ్యాకల్టీ..
ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థల్లో çఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 1,600 మంది గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. వీరంతా చాలాకాలంగా తక్కువ వేతనాలతోనే పనిచేస్తున్నారు. వేతనాల పెంపుకోసం అనేకసార్లు ప్రజాప్రతినిధులు, మంత్రులకు వినతిపత్రాలు అందించారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించింది. ఈమేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
రూ.7 వేల వరకు పెరిగే ఛాన్స్..
గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నవారు ప్రస్తుతం రూ. 12 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనంతో పనిచేస్తున్నారు. జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ డైర్టెర్లు, లైబ్లేరియన్లు గెస్ట్ ఫ్యాకల్టీలో ఉన్నారు. వారి వేతనాలు తాజాగ పెంపు ప్రతిపాదనతో రూ.18 వేల నంచి రూ.24 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో 1,600 మందికి లబ్ధి చేకూరుతుంది.
విద్యావ్యవస్థ బలోపేతం..
సీఎం చంద్రబాబు విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఆయన ఉపాధ్యాయ పోస్టులు తరచూ భర్తీ చేస్తుంటారు. అక్షరాస్యత పెరిగితే ఉన్నత చదువులు చదివితే విద్యార్థులు ఉన్నతంగా ఎదిగితే రాష్ట్ర అభివృద్ధిలో భాగమవుతారని ఆయన ఆలోచన అందుకే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తూ విద్యాప్రమాణాలు తగ్గకుండా చూస్తారు. ఈ క్రమంలోనే తాజాగా గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ వేతనాలు పెంచడం ద్వారా విద్యావ్యవస్థ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. విద్యాప్రమాణాలు పెరుగతాయని అంచనా వేశారు. ఆర్థిక ప్రోత్సాహం వల్ల ఉపాధ్యాయులు మరింత ఉత్సాహంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఉంది. అందుకే భారీగా వేతనాల పెంపునకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.