Homeఉద్యోగాలుCRPF Constable Recruitment 2026: సైన్యం పిలుస్తోంది... టెన్త్, ఇంటర్, ఐటీఐతో 9,175 పోస్టులు

CRPF Constable Recruitment 2026: సైన్యం పిలుస్తోంది… టెన్త్, ఇంటర్, ఐటీఐతో 9,175 పోస్టులు

CRPF Constable Recruitment 2026: కేంద్రం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యంగ్‌స్టర్స్‌ కోసం సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) ఉదోయగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 9,175 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో మెన్స్‌కు 9,096, వుమెన్స్‌కు 79 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, పయనీర్‌ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తారు. ఏపీలో 504, తెలంగాణలో 356 పోస్టులు కేటాయించారు. ఏప్రిల్‌ 20 నుంచి మే […]

CRPF Constable Recruitment 2026: కేంద్రం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యంగ్‌స్టర్స్‌ కోసం సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) ఉదోయగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 9,175 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో మెన్స్‌కు 9,096, వుమెన్స్‌కు 79 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, పయనీర్‌ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తారు. ఏపీలో 504, తెలంగాణలో 356 పోస్టులు కేటాయించారు. ఏప్రిల్‌ 20 నుంచి మే 19 వరకు అధికారిక సైట్‌ rect.crpf.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

విభాగాలారీగా పోస్టులు..
– టెక్నికల్‌ విభాగంలో ఎలక్ట్రానిక్స్, డ్రైవర్‌ పోస్టులు ఉన్నాయి. ఐటీఐ హోల్డర్లకు ప్రాధాన్యం ఉంటుంది. ట్రేడ్స్‌మెన్‌ జాబ్స్‌లో కార్పెంటర్, ప్లంబర్, కుక్‌ వంటి స్కిల్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు. పయనీర్‌గా కన్‌స్ట్రక్షన్, ఇంజినీరింగ్‌ ట్రేడ్స్‌ ఉండాలి.
ఏపీ–తెలంగాణలో మొత్తం 860 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు..
వివిధ కేటగిరీలను బట్టి విద్యార్హతలు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ (ఎత్తు, చెస్ట్‌ మెజర్‌మెంట్‌), మెడికల్‌ ఫిట్‌నెస్‌ తప్పనిసరి. ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్ల ప్రకారం జరుగుతుంది.

దఱకాస్తు, ఎంపిక విధానం..
అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్‌ 20 నుంచి మే 19 వరకు rect.crpf.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్‌కు ఎలాంటి ఫీజు లేదు. ఎంపిక కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) జనరల్‌ నాలెడ్జ్, మ్యాథ్స్, రీజనింగ్‌ ఉంటాయి. ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌లో రన్నింగ్, లాంగ్‌ జంప్‌ ఉంటాయి. ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్‌ (స్కిల్స్‌కు) ఉంటాయి. చివరకు మెడికల్‌ ఎగ్మాజ్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఉంటాయి. పరీక్షలు జూన్‌ లేదా జూలైలో నిర్వహించే అవకాశం ఉంది.

9,175 పోస్టులకు లక్షల అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఎంపికైనవారికి వేతనం రూ.21,700 నుంచి 69,100 వరకు ఉంటాయి. డియర్‌నెస్‌ అలవెన్స్, పెన్షన్, ప్రమోషన్లు అదనం. గ్రామీణ యూత్‌కు సెక్యూర్‌ జాబ్‌. దరఖాస్తు చేసిన వెంటనే ప్రిపరేషన్, ఫిజికల్‌ టెస్ట్‌కు సన్నద్ధం కావాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper