AI Job Losses: ఇల్లు దాటితే చాలు కారులో వెళ్లిపోతారు. ఐదు రోజుల పని చేస్తారు. కొవ్వు మాత్రం కోయిస్తారు. మిగతా రెండు రోజులు ఎంజాయ్ చేస్తారు. ఐదు అంకెల జీతం.. అంతకుమించిన ప్రయోజనాలు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే నిన్నటి వరకు ఇలానే ఉండేది.. కానీ ఇప్పుడు కృత్రిమ మేధ రాకతో ఒక్కసారిగా మారిపోయింది. ఉద్యోగాలు లేవు. ఉన్నవారిని బలవంతంగా బయటికి పంపిస్తున్నారు. నిన్నటి వరకు దర్జాగా బతికిన వారంతా ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. ఇక్కడితోనే ఆగదు.. అంతకుమించి అనే రేంజ్ లోనే ఉద్యోగాల కోత ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి, మధ్యస్థాయి ఉద్యోగాలు ఐటి పరిశ్రమలో పూర్తిగా తగ్గిపోయాయి. ఇక చిన్న స్థాయి కంపెనీలు అయితే కృత్రిమ మేధ ను ఉపయోగించి పనిచేయాలని సూచిస్తున్నాయి. కృత్రిమ మేధను ఉపయోగించి పని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కృత్రిమ మేధను పర్యవేక్షించడానికి ఒక ఉద్యోగిని కంపెనీలో ఉంచుకొని.. మిగతా వారందరిని తొలగిస్తున్నాయి.
Also Read: Tata Mahindra Tesla: టెస్లా రాకతో టాటా, మారుతి, హ్యూందాయ్, మహీంద్రా పై ఎఫెక్ట్ ఎంత?
ఇలా ఉద్యోగాల నుంచి తొలగించుకుంటూ వెళ్తే మిగతా వారి పరిస్థితి ఏమిటి? వారు ఇబ్బంది పడాల్సిందేనా? అంటే దీనికో సొల్యూషన్ ఉంది. కాకపోతే ఐటీ విభాగం లో పనిచేస్తున్న వారంతా తమ ఈగోలను పక్కన పెట్టాలి. నేను చదివింది బీటెక్ లేదా ఎంటెక్.. నేను ఐటీ ఉద్యోగం మాత్రమే చేస్తాను. నాకు ఆ స్థాయిలోనే వేతనాలు కావాలి.. ఆ స్థాయిలో వేతనాలు వచ్చే కంపెనీ దొరికేంతవరకు నేను ఎదురు చూస్తాను అంటే కుదరదు.. ప్రస్తుతం ప్రతి విభాగంలోనూ కృత్రిమ మేధ కనిపిస్తోంది.. అలాంటప్పుడు కొత్త ఉద్యోగాల సృష్టి అనేది దాదాపు అసాధ్యం. ఉన్న ఉద్యోగాలు ఉండడం కూడా కష్టమే. ఒక రకంగా కృత్రిమ మేధ ను పర్యవేక్షించడానికి ఒక ఉద్యోగి ఉంటే కంపెనీలకు సరిపోతుంది. కృత్రిమ మేధ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత కంపెనీలకు కూడా మిగులుబాటు బీభత్సంగా ఉంటున్నది. కంపెనీలు కేవలం మిగులుబాటును మాత్రమే చూసుకుంటాయి. మిగతా విషయాలను పక్కనపెడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఉద్యోగాలను ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్మెంట్ చేయలేదు. ఉదాహరణకు కర్మ గారాలలో పనిచేసే ఉద్యోగాలు.. క్షేత్రస్థాయిలో ఉండి పనిచేసిన ఉద్యోగాలను ఎంచుకోవాలి. అందులోనూ గ్రోత్ ఉంటుంది.
శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిద్ర కూడా సక్రమంగా పడుతుంది. అస్తమానం అదే కంప్యూటర్ ముందు కూర్చుని.. ఏసీ గదిలలో విశ్రాంతి తీసుకొని ఉండే ఉద్యోగాలకు ఇప్పుడు గ్యారెంటీ లేదు. ఫీల్డ్ లెవల్లో పనిచేయలేను అనుకుంటే.. ఒళ్ళు వంచలేను అనే భావన ఉంటే.. కచ్చితంగా ఇన్నోవేషన్ స్టార్టప్స్ ఏర్పాటు చేసుకోవాలి. అయితే దానికి కచ్చితంగా ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండాలి. ఇన్వెస్టర్స్ ను సొంతం చేసుకుని దారులు కూడా తెలియాలి. అయితే ఇలాంటి వ్యవహారం అందరికీ సాధ్యమయ్యేది కాదు. స్థూలంగా చెప్పాలంటే మనదేశమనే కాదు.. ప్రపంచం మొత్తం స్కిల్ మీద ఆధారపడుతోంది. అటువంటి వారికి గిరాకీ ఉంటుంది..
Also Read: New UPI Rules: డబ్బు కట్ అయితే టెన్షన్ అక్కర్లేదు.. నేటి నుంచి యూపీఐ కొత్త రూల్
ప్రస్తుతం మన దేశంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ బీభత్సంగా ఉంది. అప్పుడప్పుడు కొంచెం నేల చూపులు చూసినా.. మిగతా సందర్భాలలో ఆ రంగానికి తిరుగులేదు. ముంబైలో ఆకాశాన్ని తాకే బిల్డింగులు కడుతున్నారు. మంగళూరులో పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ దాకా అన్ని ప్రాంతాలలోనూ రియల్ ఎస్టేట్ బిజినెస్ అద్భుతంగా ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు ఈ వ్యాపారంలో ఉన్నాయి. ఇంతటి భారీ భవనాలు కట్టాలంటే కచ్చితంగా ఆ కంపెనీలకు సివిల్ ఇంజనీర్లు కావాల్సిందే. ఆర్కిటెక్ట్ లు కూడా అవసరమే.. ఇక ఈ విభాగంలో విభిన్నంగా పనిచేసే వారికి విపరీతమైన డిమాండ్ ఉంది.
నిత్యం అవకాశాలు ఉండే సివిల్ రంగాన్ని యువత ఎంచుకోవాలి.. మెకానికల్ రంగంలోనూ విపరీతంగా అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ లోనూ అదే స్థాయిలో అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఐటీ ని పక్కన పెట్టి ఇటువంటి కోర్సులను ఎంచుకుంటే ఒడిదుడుకులు లేని ఉద్యోగాలు సాధించవచ్చు. ఎందుకంటే ఈ రంగాలతో నిత్యం పనే ఉంటుంది. పైగా ఇవి మనిషి భూమ్మీద ఉన్నంతవరకు ఈ రంగాలతో అవసరమే ఉంటుంది. అలాంటప్పుడు వీటిని చిన్నచూపు చూడకుండా.. వీటిలో ప్రావీణ్యం సంపాదిస్తే తిరుగుండదు.