కరోనా పుట్టినిల్లుు వూహాన్ నగరంలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఈనెల 24 నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ముందుగా టీకాలు ఇస్తున్నారు. ఇందుకోసం జిల్లాల్లో 48 ఆసుపత్రులను ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్ 31న ఇక్కడ కరోనా వైరస్ అధికారికంగా గుర్తించారు. ఆ తరువాత ప్రపంచం మొత్తం వైరస్ పాకింది. కోట్ల మందికి వైరస్ బారిన పడగా లక్షలాది మంది వైరస్ తో చనిపోయారు.