Puri Jagannadh Net Worth 2026: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… స్టార్టింగ్ లో మూడు నెలల్లో సినిమాను చేసి ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…తొందరగా సినిమాను తీసి సూపర్ సక్సెస్ ను సాధించే కెపాసిటి పూరి జగన్నాథ్ కి మాత్రమే ఉందని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు… ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి ‘స్లమ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. నిజానికి పూరి జగన్నాథ్ కి ఒకప్పుడు తన స్నేహితుడు వంద కోట్ల మేరకు నష్టం కలిగించాడనే విషయాన్ని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఆ తర్వాత కూడా ఆయన భారీగా సినిమాలను చేసి ఎక్కువ డబ్బులను సంపాదించి మళ్ళీ రికవరీ అయ్యాడు. ఇక ప్రస్తుతం అతని నెట్ వర్త్ ఎంత అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ప్రస్తుతం అతనికి 1000 కోట్ల వరకు ఆస్తులైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ల్యాండ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ప్రస్తుతం వాటి వాల్యూ వందల కోట్లకు పెరిగిపోవడంతో ఇప్పుడు అతని ఆస్తి విలువ ఈజీగా 1000 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.
ఇక పూరి జగన్నాథ్ చార్మితో కలిసి ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం అందులోనే సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే గత రెండు సినిమాల నుంచి వాళ్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించినప్పటికి లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు భారీ డిజాస్టర్లుగా మారాయి. దాంతో ఆయన చాలావరకు డీలా పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం ఆయన చార్మితో కలిసి సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి గల కారణం ఏంటి అంటే అతను అప్పుగా చార్మి దగ్గర 150 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నాడట. వాటిని రికవరీ చేయాలి అంటే తనతో ఒక సక్సెస్ ఫుల్ సినిమాను చేసి తన డబ్బుల్ని తనకు సెటిల్ చేసి తన నుంచి విడిపోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ‘స్లమ్ డాగ్’ సినిమాతో అయిన అది నెరవేరుతుందా లేదా అనేది చూడాలి…