https://oktelugu.com/

డ్రంకెన్ డైవ్ కేసులో పదేళ్ల జైలు శిక్ష: సీపీ సజ్జనార్

ఇకపై సైబరాబాద్ పరిధిలో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే ఐపీసీ 304 సెక్షన్ కింద కేసులు నమోద చేసి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేలా చూస్తామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో నిన్న ఒక్కరోజే 402 మంది పై కేసులు నమోదయ్యాయన్నారు. ఈ వారం పాటు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ టీమ్స్ ఉంటాయన్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్ తో పాటు ఎస్వోటీ పోలీసులు కూడా డ్రంకెన్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 29, 2020 3:27 pm
    Follow us on

    ఇకపై సైబరాబాద్ పరిధిలో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే ఐపీసీ 304 సెక్షన్ కింద కేసులు నమోద చేసి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేలా చూస్తామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో నిన్న ఒక్కరోజే 402 మంది పై కేసులు నమోదయ్యాయన్నారు. ఈ వారం పాటు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ టీమ్స్ ఉంటాయన్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్ తో పాటు ఎస్వోటీ పోలీసులు కూడా డ్రంకెన్ డ్రైవ్ లో పాల్గొంటారని వెల్లడించారు. తాగి రోడ్లపైకి వచ్చి డ్రైవ్ చేసేవారిని ఎవరినీ వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు.